»Vd13 Kickstarts Slated For Sankranti 2024 Release
VD13: సంక్రాంతి కానుకగా విజయ్ దేవర కొండ మూవీ!
గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ(vd13) మళ్లీ దర్శకుడు పరశురాంతో చేతులు కలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవల అధికారికంగా ప్రారంభించబడింది. తాత్కాలికంగా VD13 అని పేరు పెట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల దర్శకుడు పరశురామ్(VD13)తో ఓ సినిమా మొదలుపెట్టారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసి, లాంఛనంగా మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే పేరు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌తో విజయ్ దేవరకొండ రొమాన్స్ చేస్తున్నాడు. మేకర్స్ త్వరలో రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించనున్నారు. గతంలో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. గీతాగోవిందంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించింది.
కాగా ఈ మూవీని సంక్రాంతి(Sankranti)కానుక విడుదల చేయాలని అనుకుంటున్నారట. 2024 సంక్రాంతి కి ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీత దర్శకుడు కాగా, మోహనన్, మార్తాండ్ కె వెంకటేష్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్ నాని 30లో నటిస్తోంది.