»Baby Beauty Faces Awkward Question And Answers Like
Baby: బ్యూటీకి వింత ప్రశ్నలు..ధీటుగా సమాధానం!
బేబీ మూవీ విడుదల తర్వాత మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ వైష్ణవి చైతన్యకు మీడియా నుంచి బోల్డ్ సీన్స్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటికి ఆమె ధీటుగా ఆన్సార్ చేయడం విశేషం.
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం బేబీ(Baby). వైష్ణవి చైతన్య హీరోయిన్గా టైటిల్ పాత్రలో నటించింది. విరాజ్ మరో కీలక పాత్రలో నటించారు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న`కలర్ ఫొటో` సినిమాకు కథ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎస్కెఎన్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ దగ్గరి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఓ కొత్త కథని చెబుతున్నారనే ఫీల్ ని ప్రేక్షకులకు చేరవేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయింది.
ముఖ్యంగా, హీరోయిన్, యూట్యూబర్ వైష్ణవి చైతన్య యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. కాగా, ఆమె ఈ మూవీలో బోల్డ్ షో చేసి ఆకట్టుకుంది. కాగా, ఇదే విషయంపై ఆమెకు మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ తల్లిదండ్రులు సినిమాను చూసుంటారు. మీరు నటించిన బోల్డ్ సీన్స్ చూసిన వారి స్పందన ఏంటి? అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై వైష్ణవి చైతన్య చక్కగా సమాధానం ఇచ్చింది. నేను నా తల్లిదండ్రులతో కలిసి మూవీ చూశాను. వారు నటిగా ఫ్రీడమ్ ఇచ్చారు. వారు పేరెంట్స్‌గా కాకుండా సాధారణ ప్రేక్షకులుగానే సినిమా చూశారు. వారు బోల్డ్ సీన్స్ చూస్తున్నప్పుడు మైండ్‌లో ఏవైనా చిన్న ఆలోచనలు వచ్చి పోయుండొచ్చు. కానీ.. వాళ్లు మాత్రం ఆడియెన్స్‌గానే సినిమాను చూశారు. సినిమాను చూసిన తర్వాత వాళ్లను కూర్చో పెట్టి బోల్డ్ సీన్స్ గురించి అడిగాను కూడా. కానీ వాళ్లు దానిపై ఆడియెన్స్‌గానే సినిమా చూశామని చెప్పారు’’ అని పేర్కొన్నారు వైష్ణవి చైతన్య.