ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణులైన SC, ST, మైనారిటీ నిరుద్యోగ యువతకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కల్పిస్తున్నట్లు ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. గురువారం SC స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్తో కలిసి వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ, వసతి సౌకర్యాలను యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఎంపీ కోరారు.