రష్మిక, భీష్మ కాంబోపై వచ్చిన రూమర్స్ మూవీ మేకర్స్ కొట్టిపారేశారు. నితిన్, వెంకీ కుడుముల నుంచి రష్మిక మందన్న(Rashmika mandanna) తప్పుకున్నట్లు ఇటీవల వచ్చిన పుకార్లు నిజం కాదని తెలిపారు.
హీరో నితిన్(nitin), వెంకీ కుడుముల ప్రాజెక్ట్ నుంచి రష్మిక మందన్న(Rashmika mandanna) తప్పుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక మందన్న, నితిన్ జంటగా నటించిన చిత్రం భీష్మ. వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే సినీ ప్రేమికులు ఉత్సాహం నింపారు. కానీ రష్మిక మందన్న తన బిజీ షెడ్యూల్, ప్రాజెక్ట్‌ల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు రావడంతో ప్రజలు నిరాశ చెందారు. రష్మిక స్థానంలో శ్రీలీలాను మేకర్స్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు అవన్నీ పుకార్లను కొట్టివేస్తూ చిత్ర యూనిట్(movie makers) క్లారిటీ ఇచ్చింది. వారు ఇది పూర్తిగా అర్ధంలేని వార్త అని అన్నారు. రష్మిక చాలా ప్రొఫెషనల్ నటి, ఆమె ఒక కమిట్మెంట్ చేస్తే, ఆమె దానికి కట్టుబడి ఉంటుంది” అని మూవీ టీమ్ చెప్పడం విశేషం. సినిమా షూటింగ్‌లు హీరో, హీరోయిన్ల తేదీల ఆధారంగా ప్లాన్ చేస్తారు. డేట్స్ కేటాయించడం కష్టంగా మారిందని గ్రహించిన రష్మిక స్వయంగా నిర్మాతలను కలిసి ఇదే విషయాన్ని తెలియజేసింది. నిర్మాతలు కూడా ఆమె కష్టాలను అర్థం చేసుకుని కొత్త హీరోయిన్ను వెతకాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయం పరస్పరంగా కలిసి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.