యాంకర్ రష్మీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు రష్మి చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసింది. ఆ సమయంలో ఆమెను ఎవరూ గుర్తించలేదు. కానీ, ఎప్పుడైతే ఆమె జబర్దస్త్ కి యాంకర్ గా మారిందో, ఆమె క్రేజ్ మారిపోయింది. ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. అప్పటి నుంచి ఆమె కంటిన్యూస్ గా టీవీ షోలో చేస్తూనే ఉంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'ప్రాజెక్ట్ కె' కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రోజుకో అప్డేట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ టైం ఫిక్స్ చేయగా.. ఫస్ట్ టైం ఈ ప్రాజెక్ట్ నుంచి ఓ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హీరోయిన్గా నటిస్తున్న దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.
తెలంగాణ ఎన్నికలను టార్గెట్ చేస్తూ నిజాం కాలం నాటి రజాకార్ వ్యవస్థను వక్రీకరించి రజాకార్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారని ముస్లిం సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి.
దివంగత నటి శ్రీదేవి ఇద్దరు కూతుళ్లలో ఒకరైన జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ బ్యూటీ సిసిమాలతో ఎంతో బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది. తన ఫ్యాన్స్ కి సంతోషపరచడానికి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ చాలా కాలంగా వివాదాస్పద వార్తలతోనే వార్తల్లో నిలుస్తోంది. హీరోయిన్ మారిపోవడం, మ్యూజిక్ డైరెక్టర్ పై విమర్శలు, డైరెక్టర్ పై ట్రోల్స్ ఇలానే చాలానే జరిగాయి. మధ్యలో సినిమా ఆగిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే అంతా సర్దుకుపోయి ఎలాంటి బ్రేక్‌లు లేకుండా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవల అల...
ఆనంద్ దేవరకొండ హీరో చాలా కాలం తర్వాత హిట్ కొట్టారు. ఆయన నటించిన తాజా చిత్రం బేబీ. ఆయన కెరీర్ లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు.
పేరుకేమో పెద్ద ప్రాజెక్ట్ పట్టేసింది.. ఇక తన కెరీర్‌కు తిరుగు లేదని ఫిక్స్ అయిపోయింది.. కానీ ప్రస్తుతం అమ్మడి పరిస్థితి చూస్తే.. పాపం అనిపించక మానదు. అయినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై భారీ ఆశలే పెట్టుకుంది. అందుకే.. తాజాగా హరిహర వీరమల్లు గురించి ఓ అప్డేట్ ఇచ్చింది.
ఎందుకో, ఏమో తెలియదు గానీ.. ప్రస్తుతం అక్కినేని మూడో తరం హీరోలు బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నారు. కొడుకులే కాదు తండ్రి కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ బాక్సాఫీస్ రేసులో వెనకబడిపోయారు. అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలో హిట్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నట్...
ప్రస్తుతం 'భోళా శంకర్' అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు చిరు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు టాలెంటెడ్ డైరెక్టర్స్ చిరు కోసం కథలు రాసే పనిలో ఉన్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ టాలెంట్‌తో చర్చలు జరుపుతున్నాడట చిరు.
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక సరికొత్త కంటెంట్‌కు కొదవ లేకుండా పోయింది. అలాగే నటీ నటులకు అవకాశాలు ఎక్కువయ్యాయి. ఫేడవుట్ హీరోలు, హీరోయిన్లు, వెటరన్ యాక్టర్స్ సిరీస్‌ల బాట పడుతున్నారు. తాజాగా జేడీ చక్రవర్తి 'దయా' అనే సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
విక్టరీ వెంకటేష్ చివరిగా ఎఫ్3 మూవీతో వచ్చారు. ఆ మూవీ తర్వాత ఆయన కొద్దిగా గ్యాప్ తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో వెంకీ మామ సినిమాలకు దూరమయ్యాడు అని వార్తలు హల్చల్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వెంకీ ఫార్మ్ లోకి వచ్చేశాడు.
పాన్ ఇండియ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె చిత్రం నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది.
ప్రతి శుక్రవారంలానే ఈ వారం కూడా సినిమా ప్రేమికులను అలరించడానికి కొత్త సినిమాలు ముస్తాబు అవుతున్నాయి. అయితే ఈ వారం పది మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయబోతున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) ఆగిపోయిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ అంచనాలున్నాయి. అందుకు కారణం.. గబ్బర్ సింగ్ కాంబో అనే చెప్పాలి. కానీ ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
సలార్(Salaar) అంటే చాలు.. దెబ్బకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా.. క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. దాంతో రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది సలార్ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా పై జగపతి బాబు(Jagapathi Babu) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.