»Ustad Bhagat Singh Movie Stopped Harish Shankar With Ravi Teja
Ustad Bhagat Singh: ఔట్..’రవితేజ’తో హరీష్ శంకర్?
ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) ఆగిపోయిందా? అంటే, ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై భారీ అంచనాలున్నాయి. అందుకు కారణం.. గబ్బర్ సింగ్ కాంబో అనే చెప్పాలి. కానీ ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ..అప్పట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసేసింది. ఇప్పటి వరకు హరీష్ శంకర్ చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. దాంతో మరోసారి పవర్ స్టార్‌తో మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. అందుకే గత రెండు, మూడేళ్లుగా.. చేస్తే పవన్‌తోనే సినిమా చేస్తానని వెయిట్ చేస్తున్నాడు హరీశ్ శంకర్. ఎట్టకేలకు..దశాబ్ద కాలం తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. అయితే ముందుగా భవదీయుడు భగత్‌సింగ్ టైటిల్‌తో సినిమా అనౌన్స్ చేసి.. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh)గా టైటిల్ మార్చారు. టైటిలే కాదు.. ఈ సినిమా తమిళ్ హిట్ మూవీ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కుతోందనేది ఇండస్ట్రీ టాక్. అయిన కూడా మార్పులతో అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ మధ్యే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే కొన్ని కీ షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఈ సినిమా ఆగిపోయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) OGకి డేట్స్ కేటాయిస్తున్నారు. హరి హర వీరమల్లుని కూడా ఎలక్షన్స్ లోపే కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. కానీ ఈమధ్యలో ఉస్తాద్ పై ఎలాంటి అప్డేట్ రావడం లేదు. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ బ్రేక్ ఇచ్చారు. కాదు కాదు ఆగిపోయిందనే టాక్ ఊపందుకుంది. అంతేకాదు.. హరీష్ శంకర్ మరో సినిమాని సెట్ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. హిందీలో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ సినిమాను.. మాస్ మహారాజ రవితేజ(ravi teja)తో రీమేక్ చేయబోతున్నాడట హరీష్ శంకర్. అలాగే.. హీరోయిన్ శ్రీలీల కూడా ఉస్తాద్ డేట్స్‌ని ఇతర సినిమాలకి ఇచ్చేస్తోందట. చూడాలి మరి.. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇస్తాడేమో!