ప్రస్తుతం తమిళ్ హిట్ మూవీ 'వేదాళం' రీమేక్‌గా తెరకెక్కుతున్న 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ సెట్ చేసే పనిలో ఉన్నారు చిరు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు టాలెంటెడ్ డైరెక్టర్స్ చిరు కోసం లైన్లో ఉన్నారు. అందులో కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ఓకె అయిపోయింది. ఈ సినిమాలోనే మెగాస్టార్ డిఫరెంట్ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది.
గత కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా.. పీకల్లోతు ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఫైనల్‌గా ఇరు కుటుంబాలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. దాంతో పెళ్లికి ముందే కాఫీ డేట్ అంటూ.. ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగుపెడుతోంది. లియో సినిమాతో ఇతర ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆ సంస్థకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం బవాల్. ఈ మూవీలో ఆమెకు జోడిగా వరుణ్ ధావన్ నటించారు. సాజిద్ నడియద్ వాలా నిర్మించిన ఈ సినిమాకి, నితేశ్ తివారి దర్శకత్వం వహించాడు. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా స్క్రీనింగ్ ఏర్పాటు చేయగా జాన్వీ హాజరైంది.
మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు.. ఆ రోజుని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు మెగా ఫాన్స్. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. కానీ ఈసారి బ్రో మేకర్స్ మాత్రం అలా చేయడం లేదు. అయినా బ్రో క్రేజ్ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో దుమ్ములేపుతోంది బ్రో.
నిజమే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. జూలై 28న మామ పవన్‌తో కలిసి 'బ్రో'గా రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలిపాడు.
జూలై 25న బ్రో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ మూవీకి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.
రీ ఎంట్రీ తర్వాత పవన్ నుంచి వస్తున్న మూడో రీమేక్ చిత్రం 'బ్రో'. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత 'బ్రో' రీమేక్‌తో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నారు పవర్ స్టార్. మరో వారం రోజుల్లో బ్రో మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఈ క్రమంలో బ్రో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ K నుంచి అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీలో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఉస్తాద్ మూవీ నుంచి మేకర్స్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సింహా కోడూరి నటించిన ఈ సినిమాలో కావ్య కల్యాణ్ రామ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(jr ntr) నుంచి వస్తున్న సినిమా దేవర(Devara). ఆయన 30వ సినిమాగా ఈ సినిమా వస్తోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా టైటిల, ఫస్ట్ లుక్ ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏపీ నటి కోమలీ ప్రసాద్(Komalee Prasad) క్రమంగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసి ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
అగ్రరాజ్యం అమెరికాలో జూలై 20న జరిగే కామిక్ కాన్ ఈవెంట్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో పాల్గొననున్న మొదటి చిత్రంగా ప్రాజెక్టు కే(Project K) నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ హీరో ప్రభాస్(america) సహా పలువురు యూఎస్ చేరుకున్నారు.
క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) చిత్రాలు అంతా ఈజీగా అర్థం కావు. కథలో క్యారెక్టర్స్ లోని లేయర్స్ తికమక పెడతాయి. ఒక ఫజిల్ లా సాగే కథలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనే భావన కలుగుతుంది. ఇప్పుడు ఓపెన్‌హైమర్(oppenheimer) అనే మరో మూవీతో మనముందుకు రాబోతున్నారు.
దేశంలో వచ్చే నాలుగేళ్లలో మీడియా, వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుంతుందని PwC గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ & మీడియా ఔట్‌లుక్ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఏకంగా 6 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.