ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(jr ntr) నుంచి వస్తున్న సినిమా దేవర(Devara). ఆయన 30వ సినిమాగా ఈ సినిమా వస్తోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా టైటిల, ఫస్ట్ లుక్ ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
దేవర(Devara) సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఓ రియల్ లైఫ్ కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం కొరాటల శివ భారీ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హీరోని ఎలివేట్ చేయడానికి ఆయన చాలా ఎక్కువ కసరత్తులు చేస్తున్నారట. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తుండగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. జాన్వీ(Janhvi Kapoor), సైఫ్ అలీఖాన్ ఇద్దరూ టాలీవుడ్లోకి ఈ మూవీతో అడుగుపెడుతున్నారు.
కొరటాల శివ(koratala siva) ఇప్పటికే ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్లతో కూడిన హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నిజజీవితం(real story)లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని, దారుణమైన హత్యాకాండను హైలైట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక మూలం “ఈ పెద్ద యాక్షన్ చిత్రం 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ తుఫానును రేకెత్తించిన భయంకరమైన కారంచేడు (ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల సమీపంలోని ప్రదేశం) సంఘటన గురించి తీస్తున్నట్లు సమాచారం.
కొంత మంది దళితుల(dalith)ను క్రూరమైన అగ్రవర్ణ దుండగులు ఊచకోత కోశారు. వందలాది మంది దళితులను నిరాశ్రయులను చేశారు. ఇఫ్పుడు ఈ అంశాన్ని ఈ మూవీలో చూపిస్తున్నట్లు తెలిసింది. వాస్తవిక సంఘటనల నుంచి ప్రేరణ పొందిన చలనచిత్రాలు ఎల్లప్పుడూ ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే బాధితులు అనుభవించే బాధ, వేదన అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.