Sai Dharam Tej: షాకింగ్ డెసిషన్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్!
నిజమే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. జూలై 28న మామ పవన్‌తో కలిసి 'బ్రో'గా రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్టు తెలిపాడు.
రిపబ్లిక్ సినిమా రిలీజ్ సమయంలో బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej). చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. దాంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే.. రిపబ్లిక్ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan Kalyan) ప్రమోషన్స్ చేశాడు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇక కోలుకున్న తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో చేసిన ‘విరూపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్‌తో కలిసి ‘బ్రో’ సినిమా(BRO Movie)తో మరో వారం రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు సుప్రీమ్ హీరో.
హీరోయిన్ కేతిక శర్మ(Kethika sharma)తో బ్రో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆరు నెలల పాటు సినిమాలకి, షూటింగ్స్‌కి బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాని చెప్పుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్(sai dharam Tej). యాక్సిడెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్నప్పటికీ ఇంకా ఫిట్‌గా కనిపించడం లేదు తేజ్. విరూపాక్ష సినిమాతో పాటు బ్రో సినిమా(BRO Movie)లో రిలీజ్ అయిన పాటల్లో కాస్త కష్టంగా స్టెప్పులు వేసినట్టుగా కనిపించాడు సాయి. అందుకే ఇకపై చెయ్యబోయే సినిమాల కోసం వంద శాతం బెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఆడియెన్స్ నుండి తనపై ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు.
ఓ చిన్న సర్జరీ చేయించుకోవాలి. ఆ తర్వాత బలంగా తిరిగి వస్తాను. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చు అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ సంపత్ నందితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆరు నెలల తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. ఇక బ్రో సినిమా(BRO Movie)లో పవన్ దేవుడిగా నటిస్తుండగా ఆయన భక్తుడిగా సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ పీక్స్‌లో ఉంటాయని తెలుస్తోంది.