»Family Emotions Are Amazing In Bro Movie Producer Tg Vishwaprasad
BRO Movie: బ్రో మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ అద్భుతం: నిర్మాత టీజీ విశ్వప్రసాద్
జూలై 25న బ్రో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ మూవీకి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(saidharam Tej) కలిసి నటిస్తున్న చిత్రం బ్రో(BRO Movie). సముద్రఖని ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్(TG Viswa Prasad) ఈ మూవీని నిర్మిస్తున్నారు. సహనిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించారు. థమన్ మ్యూజిక్ అందించారు. జూలై 28న ఈ మూవీ విడుదలవుతున్న తరుణంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు.
మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు త్రివిక్రమ్ ఈ సినిమాను తమిళంలో చూసి తెలుగులో చేస్తే బావుంటుందని చెప్పారని, అందుకే తన సొంత బ్యానర్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు. తమిళంలో కంటే తెలుగులో భారీ మార్పులు చేసినట్లు చెప్పారు. ఈ మూవీలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు. సముద్రఖని ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారన్నారు.
సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటి పది నిమిషాలు మాత్రమే ఉండరని, ఆ తర్వాత చివరి వరకూ ఉంటారని తెలిపారు. ఇది సందేశాత్మక చిత్రం కాదని, కమర్షియల్ ఎలిమెంట్స్, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ చిత్రమని వెల్లడించారు. సినిమాలో పవన్, సాయి తేజ్ పాత్రలు ప్రేక్షకులను హత్తుకుంటాయన్నారు. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలా కట్టిపడేస్తాయని తెలిపారు. ఈ మూవీకి ముందునుండి సాయి ధరమ్ తేజ్‌నే అనుకున్నామని, అనుకున్న బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేసినట్లు తెలిపారు.
బ్రో మూవీకి టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని, ఇప్పుడున్న ధరలతోనే విడుదల చేస్తున్నట్లు టీజీ విశ్వ ప్రసాద్ వెల్లడించారు. సినిమాలో పవన్ సాయి తేజ్‌ను బ్రో అంటారని, అందుకే ఈ మూవీకి ఆ టైటిల్ పెట్టినట్లు రివీల్ చేశారు. జూలై 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని తెలిపారు. బ్రో మూవీకి ప్రీమియర్ షోలు వేసే ఆలోచన లేదన్నారు. తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టం అని, ఆయనతో సినిమా చేయడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వెల్లడించారు. ప్రస్తుతం తమ బ్యానర్లో 15-20 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. త్వరలోనే ముంబైలో ఆఫీస్ ఓపెన్ చేసి బాలీవుడ్ సినిమాలు చేస్తున్నట్లు టీజీ విశ్వ ప్రసాద్(TG Viswa Prasad) తెలిపారు.