Salaar:పై జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..ఇది కూడా షెడ్డుకేనా?!
సలార్(Salaar) అంటే చాలు.. దెబ్బకు సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా.. క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేస్తుంది. దాంతో రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది సలార్ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా పై జగపతి బాబు(Jagapathi Babu) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జూలై 6న రిలీజైన సలార్(Salaar) టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే 83 మిలియన్ల వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డు సెట్ చేసింది. అంతేకాదు.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి.. యూట్యూబ్‌లో మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఆగస్టులో రానున్న సలార్ ట్రైలర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా సలార్ పై జగపతి బాబు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో జగపతి బాబు(Jagapathi Babu) విలన్‌గా నటిస్తున్నాడు. రాజమన్నార్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రివీల్ చేయగా.. భయంకరంగా ఉన్నాడు జగ్గు భాయ్. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో.. ‘సలార్ సినిమా కోసం అయిదు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నాను..’ చెప్పిన జగపతి బాబు.. ఇప్పుడు కొన్ని షాకింగ్ కామెంట్స్(comments) చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సలార్’ మొదటి భాగంలో తనకు, ప్రభాస్(prabhas)కు మధ్య ఒక్క సన్నివేశం కూడా లేదని చెప్పారు. అసలు ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరో-విలన్‌కి మధ్య ఒక్క సీన్ కూడా లేకపోవడం ఏంటనేది.. హాట్ టాపిక్‌గా మారింది. కానీ సెకండ్ పార్ట్‌లో మాత్రం కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చాడు జగ్గు. ఇక ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’లో మళయాళ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్‌గా కనిపించనున్నాడు. ప్రశాంత్ నీల్(prashanth neel) ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ వారు భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరెక్కిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రెయా రెడ్డి కీ రోల్ ప్లే చేస్తోంది.