»Telangana Governor Tamilisai Congratulates Hero Krishna Sai
Hero: కృష్ణసాయికి గవర్నర్ తమిళి సై అభినందన
యుక్తవయసులో మాదకద్రవ్యాలను నిరోధించడంతోపాటు వారి తల్లిదండ్రలకు అవగాహన కల్పించే లక్ష్యంతో చిత్రం చేస్తున్న హీరో కృష్ణ సాయి(Krishna Sai)ని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(tamilisai soundararajan) అభినందించారు.
సుందరాంగుడు సినిమా హీరో కృష్ణ సాయి(Hero Krishna Sai)..తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్(tamilisai soundararajan) నుంచి ప్రశంసలు అందుకున్నారు. డ్రగ్స్ పట్ల యువత, తల్లిదండ్రులకు చైతన్యం కల్పించే విధంగా నిర్వహిస్తున్న కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా కృష్ణసాయి చేస్తున్న ప్రయత్నాన్ని గవర్నర్ అభినందించారు. సామాజిక అవగాహనలో భాగంగా MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రొడక్షన్ నంబర్.2 చిత్రంలో Danger ‘say no to Drugs..’ అనే ప్రత్యేక పాటను చిత్రీకరించారు. దర్శకుడు పీఎస్ నారాయణ రాసిన ఈ పాటలో హీరో కృష్ణ సాయి నటించారు.
చాలా మంది యువత డ్రగ్స్(drugs) ఊబిలో చిక్కుకుని జీవితాలను నష్టపోతున్నారని, డ్రగ్స్ నిర్మూలనపై తమ కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా అవగాహన కల్పిస్తున్నామని హీరో కృష్ణ సాయి తెలిపారు. డ్రగ్స్ అలవాటు పడిన వారు బయటకు రాలేకపోతున్నారని, నగరాల్లో డ్రగ్స్ బాధితులు చాలా మంది ఉంటున్నారని చెప్పారు. వారికి సరైన గైడెన్స్ దొరకడం లేదని, వారికి అవగాహన కల్పించేందుకు తాము ఆగస్టులో హైదరాబాద్‌లో సెమినార్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సైని ఆహ్వానించామని కృష్ణసాయి చెప్పారు. తమ ప్రయత్నాన్ని అభినందించిన గవర్నర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.