Poonam Kaur's tweet on AP Politics. Pawan's fans, Janasena party workers are angry on the net
నటీ పూనమ్ కౌర్(Poonam Kaur) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల్లో పాపులారిటీ మాత్రం విపరీతంగా సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూనమ్ తన ట్వీట్లతో రాజకీయంగా, సినిమా పరంగా దుమారం లేపుతుంది. తాను కూడా పులు వివాదాల్లో చిక్కుకొని నెటిజనులతో ట్రోల్ అవుతుంది. తాను పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తుందని ఆయన అభిమానులు ఆరోపిస్తు ఉంటారు. అయితే తాజాగా తాను చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడమే కాకుండా మళ్లీ పూనమ్ సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచింది.
ఏపీ పాలిటిక్స్ పై తన ట్వీట్ లో ఏమన్నది అంటే..ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని సానుభూతిని, అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు(womens) ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారు. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు మహిళలపై ప్రేమ చూపిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని అర్థం వచ్చేలా రాసుకొచ్చింది.
అయితే తన ట్వీట్ లో ఏ వ్యక్తిని ఉద్దేశించి పెట్టిందో రాయలేదు కానీ యాష్ ట్యాగ్ ఆంధ్రప్రదేశ్ అని పేర్కొంది. ఇక ఈ ట్వీట్ తమ నాయకుడు పవన్ కళ్యాణ్(pawan kalyan)ను ఉద్దేశించే చేసిందని తన ట్వీట్ కింద బూతులతో కామెంట్లు చేస్తూ విరుచుకుపడుతున్నారు. ఆంధ్రాలో వారాహి యాత్రలో భాగంగా పవన్ హుమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడిన నేపథ్యంలో అక్కడ తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పూనమ్ ట్వీట్ చేయడంతో జనసేన కార్యకర్తులు కూడా పలు కామెంట్లు చేస్తున్నారు.
The people who are shouting at the top of their voice about women issues , as if they are highly concerned are the one who did not speak a word for #Wrestlers , beware of fake leaders who concern when it’s to their benefit and convenience.#AndhraPradesh
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 16, 2023