Guntur Karam Movie Big Update Leaked.. Heroine Meenakshi Chaudhary's Comments Viral..
Meenakshi Chaudhary: త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం(Gunturu Karam). ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) ఓ అప్డేట్ ఇచ్చేసింది. దాంతో మహేష్ బాబు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో తాను నటిస్తున్నట్లు చెప్పుకొచ్చిన ఈ భామ మహేష్ బాబుతో నటించడం జీవితంలో మర్చపోలేని రోజు, ఈ సినిమాలో తన ఫస్ట్ డేనే ప్రిన్స్ తో షూటింగ్ చేశానని, ఆ క్షణాలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అంటోంది.
ఈ సినిమాలో కథానాయికలుగా మొదట పూజా హెగ్డే, శ్రీలీలను ఎంపిక చేశారు. ఒక షెడ్యూల్ కూడా అయిన పూర్తి అయిన తరువాత పూజా హెగ్డే తప్పుకుంది. దీంతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయింది. రెండో హీరోయిన్గా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)ని తీసుకున్నట్లు కొంతకాలంగా టాక్ వినిపిస్తోన్న తరుణంలో.. తాజాగా హత్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మీనాక్షి చౌదరి తాను గుంటూరు కారంలో నటిస్తున్నట్లు లీక్ చేసింది. అంతే కాదు ఆ సినిమా షూటింగ్కు సంబంధించిన అప్డేట్ను కూడా చెప్పేసింది. దీంతో మహేశ్ అభిమానులు సంబరపడుతున్నారు.