Chiru కాదు చిరుత.. మెగాస్టార్ మనవరాలు స్పెషల్ విష్!
మెగాస్టార్ చిరంజీవి.. ఆగష్టు 22వ తేదీన గ్రాండ్‌గా 68వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆన్లైన్ ఆఫ్‌లైన్‌లో మెగాస్టార్‌కు బర్త్ డే విషెష్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ అంతా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్‌కు బర్త్ డే విషెష్ చెప్పారు. అందులో రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా.. చేసిన విషెష్ స్పెషల్‌గా నిలిచింది.
Chirutha: సెలబ్రిటీస్ అయితే మెగాస్టార్‌తో తమకున్న అనుబంధాన్ని చెబుతూ స్పెషల్‌గా బర్త్ డే విష్ చేస్తున్నారు. ఇక మెగాభిమానులు ఆయన గురించి చేస్తున్న ట్వీట్స్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమదైన స్టైల్లో ట్వీట్స్ చేస్తూ.. మెగాస్టార్ మెగాస్టారేని విష్ చేస్తున్నారు. తమకు ఊహ తెలిసినప్పటి నుంచి మెగాభిమాని అయినందుకు ఎంతో గర్వంగా ఉందని అంటున్నారు. ఇక స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, తమ్ముడు పవన్ కళ్యాణ్ తమదైన స్టైల్లో విష్ చేశారు. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కూతురు తరపున మెగాస్టార్‌కు బర్త్ డే విష్ చేశాడు.
చిరు.. తన మనవరాలు క్లిన్ కారాను ఎత్తుకున్న ఒక క్యూట్ ఫోటోను షేర్ చేశాడు రామ్ చరణ్. ‘మన చిరుత.. చిరంజీవి తాతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా తరపు నుంచి, కొణిదెల ఫ్యామిలీ నుంచి అందులోని చిన్న వ్యక్తి నుంచి మీకు ఎంతో ప్రేమను అందిస్తున్నాం’ అని రాసుకొచ్చాడు. అయితే ఈ ఫోటోలో క్లిన్ కారా మోహం కనిపించకుండా ఫేస్‌పై లవ్ ఎమోజీ పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చిరు బర్త్ డే రోజున రెండు ప్రాజెక్ట్స్ అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యాయి. మెగా 156, మెగా 157 సినిమాలను అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణంలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మెగా 156 సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. డైరెక్టర్ ఎవరనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇక యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా రానుంది.