Ram Charan : ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాల్లో.. ఇండస్ట్రీ హిట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. వాటిలో మగధీర కూడా ఒకటి. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఈ సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. కానీ సెకండ్ ఫిల్మ్ మగధీరతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశాడు.
ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాల్లో.. ఇండస్ట్రీ హిట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ. వాటిలో మగధీర కూడా ఒకటి. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఈ సినిమాతో పర్వాలేదనిపించుకున్నాడు. కానీ సెకండ్ ఫిల్మ్ మగధీరతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చేశాడు. 2009 జులై 31వ తేదీన రిలీజ్ అయిన మగధీర.. అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. దాదాపు 45 కోట్ల బడ్జెట్‌తో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా.. 150 కోట్ల వరకు కొల్లగొట్టింది. అంటే 3 రేట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్‌ని రాబట్టిందన్న మాట. యువరాణిగా కాజల్ అగర్వాల్, కీరవాణి సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై కనిపిస్తే అతుక్కుపోతుంటారు. అంతలా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేశాడు రాజమౌళి. అందుకే మరోసారి ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ బర్త్ డే కానుకగా.. ‘మగధీర’ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు గ్రాండ్‌గా నిర్వహంచేందుకు రెడీ అవుతున్నారు మెగాఫ్యాన్స్. వాళ్లకు మరింత కిక్ ఇచ్చేలా.. మగధీర రీ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. మార్చి 17వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి పాకింది. ఇలాంటి సమయంలో మగధీర రీ రిలీజ్ గీతా ఆర్ట్స్‌కు కలిసొచ్చేలానే ఉంది. మరి మగధీర రీ రిలీజ్ ఎంత రాబడుతుందో చూడాలి.