ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కెరీర్లో ‘పుష్ప’ మూవీ ఐకానిక్‌గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఓటీటీలో సందడి చేస్తునే ఉంది ఈ మూవీ. అందుకే అమెజాన్ ప్రైమ్‌లో ఈ ఏడాదిలో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమాల లిస్టులో.. నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. అలాంటి పుష్ప మూవీకి భారీ డ్యామేజ్ జరిగింది. డిసెంబర్ 8న పుష్ప మొదటి భాగాన్ని రష్యన్ లాంగ్వేజ్‌లో డబ్ చేసి విడుదల చేశారు. బన్నీ, సుకుమార్‌తో పాటు మిగతా చిత్ర యూనిట్ అంతా.. రష్యాకు వెళ్లి అక్కడ గట్టిగా ప్రమోషన్స్ చేశారు. అందుకోసం మేకర్స్ దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు చేశారనే టాక్ వినిపించింది. కానీ రష్యన్ పుష్ప రిలీజ్ అయి వారం కావొస్తున్న.. అక్కడి టాక్ అండ్ కలెక్షన్ల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ క్రమంలో పుష్పకు అక్కడ ఆదరణ దక్కలేదని తెలుస్తోంది. అంతేకాదు దారుణంగా కలెక్షన్స్ రావడంతో మొదటి మూడు రోజుల్లోనే సినిమాను థియేటర్లలో నుంచి తీసివేసినట్లుగా టాక్. కనీసం ప్రమోషన్ కోసం పెట్టిన బడ్జెట్ అయినా రికవరీ అయిందా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. అందుకే పుష్ప టీమ్ సైలెంట్‌గా ఉందని అంటున్నారు. దాంతో పుష్ప2కి హైప్ తీసుకొస్తుందనుకున్న పుష్ప వన్.. అంచనాలను తలకిందులు చేసేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్ప2 షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటున్నాడట. ప్రస్తుతం అల్లు స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా.. పది రోజుల షెడ్యూల్ తర్వాత రామోజీ ఫిలిం సిటీకి షిప్ట్ అవనున్నారని తెలుస్తోంది.