ప్రభాస్ నుంచి కొత్త సినిమా వచ్చినప్పుడు ఎలా రచ్చ చేస్తారో.. అలా సందడి చేస్తున్నారు అన్‌స్టాపబుల్ షో కోసం. నందమూరి నట సింహం బాలకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ ఇద్దరిని ఒకే వేదికపై చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అందుకే ఒక రోజు ముందుగానే ప్రభాస్ ఎపిసోడ్ రాబోతున్నట్టు గుడ్ న్యూస్ చెప్పింది ఆహా టీమ్. నిన్న ప్రభాస్ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు చెప్పిన ఆహా.. ‘బాహుబలి’ ఎపిసోడ్ పార్ట్ 1ను డిసెంబర్ 30న విడుదల చేయాలని అనుకున్నారు. ‘అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే.. ది బిగినింగ్ పేరుతో ఈ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారు. ‘ కానీ ‘డార్లింగ్ ఫ్యాన్స్.. మీ కోరిక మేరకు, మన ‘బాహుబలి’ ఎపిసోడ్ పార్ట్ 1 ఈ రోజే రిలీజ్ చేస్తున్నాం. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కొంచెం ముందు స్టార్ట్ చేద్దాం.. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది’.. అని ఆహా ఓటీటీ వారు ట్వీటర్లో రాసుకొచ్చారు. అలాగే బాహుబలి ఎపిసోడ్ మొత్తం100 నిమిషాలు వచ్చిందని ‘ఆహా’ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే దీన్ని రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక రెండో పార్టుకు ‘అన్‌స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే.. ది కన్‌క్లూజన్’ అని పేరుతో జనవరి 6న ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మామూలుగా సినిమాలైతే 2 పార్ట్స్‌గా వస్తాయి. కానీ టాక్ షోను కూడా రెండు భాగాలుగా తీసుకురావడం ఇదే మొదటిసారి. అది కూడా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయబోతున్నారు. ఈ లెక్కన ప్రభాస్ అన్‌స్టాపబుల్ షోకి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని గంటలు ఆగితే.. ప్రభాస్, బాలయ్య ఫన్ స్టార్ట్ అయిపోతుందని చెప్పొచ్చు.