»Glimpses Of Pushpa 2 And Aadipurush Coming On The Same Day
Pushpa 2 & Aadipurush : గ్లింప్స్.. ఒకే రోజు రాబోతున్నాయా!?
Pushpa 2 & Aadipurush : రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయా.. అంటే రిలీజ్ అనుకునేరు. అసలు మ్యాటర్ వేరే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రాబోతున్నాయా.. అంటే రిలీజ్ అనుకునేరు. అసలు మ్యాటర్ వేరే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలె షూటింగ్ మొదలు పెట్టి.. జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. రీసెంట్‌గానే హీరోయిన్ రష్మిక షూటింగ్లో జాయిన్ అయ్యింది. అయితే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఇప్పటి వరకు సుకుమార్ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం పుష్ప ది రూల్ అప్డేట్ పై దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే. త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రాబోతుందని.. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘పుష్ప2 గురించి మేము కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాం.. అతి త్వరలో గ్లింప్స్ వస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు మార్చి 8న పుష్ప2 బిగ్ అప్డేట్ రానుందనే టాక్ నడుస్తోంది. అలాగే ఆ రోజు.. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ నుంచి కూడా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. బహుశా ఆదిపురుష్ నుంచి ఫస్ట్ సింగిల్ రానుందని అంటున్నారు. అయితే ఏప్రిల్ 8నే ఎందుకంటే.. ఆ రోజు హోలీ అవడం వల్ల, సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. లేదంటే.. మార్చి 22న ఉగాది సందర్భంగా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇకపోతే ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ అవుతుండగా.. పుష్ప2 ఈ ఇయర్ ఎండింగ్ లేదా.. 2024 సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.