Kalki : ‘కల్కి’ బిజినెస్ టాక్.. ఇదే జరిగితే చరిత్ర తిరగరాసినట్టే?
Prabhas : సమ్మర్లో రానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందా అంటే, అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మాత్రమే. మే 9న రిలీజ్ కానున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో వస్తున్న అప్డేట్స్ చూస్తే.. చరిత్ర తిరగరాయడం ఖాయమంటున్నారు.
సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. పాన్ వరల్డ్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. కల్కిలో మరో కొత్త ప్రపంచం చూపించబోతున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే.. ఖచ్చితంగా కల్కి అద్భుతమైన విజువల్ వండర్‌గా రాబోతోందని చెప్పేశాడు.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో కల్కిని నిర్మిస్తున్నారు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కల్కి మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ బేరాలు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఒక్క ఓవర్సీస్లోనే 100 కోట్లకు పైగా మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది. అయితే.. ఇప్పుడు కేవలం థియేట్రికల్ హక్కుల ద్వారానే 500 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో 200 కోట్లకు పైగా బిజినెస్ జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఇండియాలో మిగిలిన తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ హక్కులు అన్నీ కలుపుకొని.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల బిజినెస్ టార్గెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారట మేకర్స్. ఇదే జరిగితే ప్రీరిలీజ్ బిజినెస్‌తోనే కల్కి చరిత్ర సృష్టించబోతోందనే చెప్పాలి. గతంలో ఏ సినిమాకు కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగలేదు. ఒక్క థియేట్రికల్ బిజినెస్ ఈ రేంజ్లో జరిగితే.. నాన్ థియేట్రికల్ బిజినెస్ కలుపుకొని కల్కి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఈ మూవీలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉండడంతో.. డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. మరి కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.