Project K ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్ట్ కె'. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఆదిపురుష్, సలార్ సినిమాలు ఒకటి రెండు సార్లు పోస్ట్ అయ్యాయి. కానీ ప్రాజెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది.
ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’. మహానటి తర్వాత యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఆదిపురుష్, సలార్ సినిమాలు ఒకటి రెండు సార్లు పోస్ట్ అయ్యాయి. కానీ ప్రాజెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది. షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టారో కూడా సరైన అప్డేట్ ఇవ్వలేదు నాగ్ అశ్విన్. కానీ ఆ మధ్య అశ్వనీదత్ 55 శాంత్ షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పుకొచ్చారు. అదే స్పీడ్‌లో 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్‌గానే ప్రకటించారు. ఇక ఇప్పుడు 90 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. మరో పది శాతం మాత్రమే పెండింగ్ ఉందని సమాచారం. అది కూడా అమితాబచ్చన్ కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే రీసెంట్గా బిగ్ బి యాక్షన్ షూటింగ్లో భాగంగా ప్రమాదానికి గురయ్యారని వార్తలొచ్చాయి. దాంతో అమితాబ్ కోలుకున్న వెంటనే ప్రాజెక్ట్ కె బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇక ఆ తర్వాత గ్రాఫిక్స్ వర్క్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారట. ఇప్పటికే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. దానికి మరో ఆరు నుంచి ఎనిమిని నెలల సమయం పట్టొచ్చని అంటున్నారు. అంటే ఆదిపురుష్, సలార్‌లా కాకుండా.. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ కె ఆడియెన్స్ ముందుకి రానుంది. అయినా ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు మేకర్స్. ఈ విషయాన్నే ప్రతీసారి సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి ఇప్పటికైనా ప్రాజెక్ట్ కె నుంచి అప్డేట్ ఇస్తారేమో చూడాలి.