»Project K Movie Is A Movie Beyond Baahubali Rrr Ranas Comments Went Viral
Rana Daggubati: ‘Project K’ బాహుబలి, RRRని మించిన సినిమా
RRR, బాహుబలి సినిమాలను కొట్టే ప్రాజెక్ట్ ఏది అంటే.. ప్రాజెక్ట్ కె(Project K movie) అంటున్నాడు రానా(Rana Daggubati). ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వాటిలో ప్రాజెక్ట్ కె పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా పై రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్ని మించి ప్రాజెక్ట్ కె ఉంటుందని.. సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు రానా.
మహానటి తర్వాత టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె(Project K movie)’. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌తో తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ వారు దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను సైన్స్ ఫిక్షనల్ డ్రామాగా భారీగా రూపొందిస్తున్నారు. దీపిక పదుకోణే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ లాంటి వారు కీ రోల్ ప్లే చేస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అయిన ఈ మూవీని.. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ సినిమాను అడ్వాన్స్డ్ టెక్నాలజితో ఊహించని కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. అద్భుతమైన విజువల్ వండర్‌గా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రతిదీ స్క్రాచ్ నుంచి కొత్తగా తయారు చేయిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ‘టైర్’, ‘రైడర్స్’కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసి భారీ హైప్ క్రియేట్ చేశాడు. మొత్తంగా ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి.
ఇక ఇప్పుడు దగ్గుబాటి రానా ఆ హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లాడు. ఇండియా టుడే కాన్క్లేవ్లో జరిగిన సమావేశంలో రానా దగ్గుబాటి(Rana Daggubati) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ‘ప్రస్తుతం ప్రభాస్ నాగశ్విన్ అనే యంగ్ డైరెక్టర్‌తో ‘ప్రాజెక్ట్ కె’ అనే సినిమా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో.. బాహుబలి, RRR చిత్రాలు టచ్ చేయని బౌండరీస్‌ని బ్రేక్ చేస్తుంది.. మేము ఆ ప్రాజెక్ట్ కోసమే ఎదురు చూస్తున్నాము’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు రానా స్టేట్మెంట్ వైరల్‌గా మారింది. అందుకు తగ్గట్టే.. రీసెంట్గా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడనే వార్తలొస్తున్నాయి. మరి ప్రాజెక్ట్ కె RRR, బాహుబలి మించి రికార్డ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.