Prabhas : Project K రిలీజ్ డేట్.. అప్పుడే క్లారిటీ!
Prabhas : ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ప్రాజెక్ట్ కె పాన్ వరల్డ్ స్థాయిలో రాబోతోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సైన్స్ ఫిక్షనల్ మూవీని.. వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ప్రాజెక్ట్ కె పాన్ వరల్డ్ స్థాయిలో రాబోతోంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సైన్స్ ఫిక్షనల్ మూవీని.. వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలాభాగం కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమాను ఈ ఏడాది ఎండింగ్ లేదా.. 2024 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఆదిపురుష్ జూన్ 16, సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నాయి. దాంతో ఈ ఇయర్లో ప్రాజెక్ట్ కె రావడం కష్టం. అందుకే సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మేకర్స్ నుంచి క్లారిటీ రావడం లేదు. అయితే ఇప్పుడా సమయం రానే వచ్చేసిందంటున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ప్రాజెక్ట్ కె రిలీజ్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. లేదంటే నెక్స్ట్ వీక్‌లో పక్కాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే.. దాదాపుగా 2024 సంక్రాంతికే ప్రాజెక్ట్ కె రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు టాక్. రిలీజ్ డేట్‌తో పాటే.. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందా.. లేదా.. అనే క్లారిటీ కూడా రానుందని అంటున్నారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం వెయిటింగ్ అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కనీసం ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదని వాపోతున్నారు. నాగ్ అశ్విన్‌ను పదే పదే ఈ విషయాన్ని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో.. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారా.. అనే టాక్ కూడా నడుస్తోంది. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.