Prabhas Vs Mahesh : ప్రభాస్‌తో మహేష్ పోటీ.. థియేటర్లు ఉంటాయా!?
Prabhas Vs Mahesh : ఇప్పటి వరకు ప్రభాస్, మహేష్ బాక్సాఫీసు దగ్గర పోటీ పడిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండబోతోంది. ఊహించని విధంగా ప్రభాస్‌తో పోటీకి వచ్చేశాడు మహేష్ బాబు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్ట్ కె'ని 2024 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు.
ఇప్పటి వరకు ప్రభాస్, మహేష్ బాక్సాఫీసు దగ్గర పోటీ పడిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండబోతోంది. ఊహించని విధంగా ప్రభాస్‌తో పోటీకి వచ్చేశాడు మహేష్ బాబు. ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ని 2024 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. కానీ ఇప్పుడు మహేష్ బాబు కూడా సంక్రాంతికే వస్తున్నట్టు ప్రకటించారు. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28ని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వాస్తవానికి ఈ సమ్మర్లోనే మహేష్ సినిమా రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత ఆగష్టు 11న విడుదల చేయలనుకున్నారు. అప్పటికీ కుదరదంటే దసరాకు అన్నారు. కానీ ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లి.. ప్రభాస్‌తో పోటీకి సై అంటున్నారు. ప్రభాస్, మహేష్ ఇద్దరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈ స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే.. థియేటర్లు ఉంటాయా.. అనే రేంజ్లో రచ్చ జరగడం ఖాయం. ఇప్పటి వరకు ప్రాజెక్ట్ కె కథేంటో ఎవరికి తెలియదు. హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక త్రివిక్రమ్ కూడా మహేష్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన మహేష్ బాబు పోస్టర్ అదిరిపోయింది. మిర్చి యార్డులో, సిగరెట్ కాలుస్తూ మహేష్ నడుచుకుంటూ వస్తున్న లుక్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. సినిమాలో ఇది భారీ ఫైట్ సీన్ అని అర్థమవుతోంది. అయితే సంక్రాంతి వరకు ప్రాజెక్ట్ కె రిలీజ్ ఉంటుందా.. లేదంటే పోస్ట్ అవుతుందా.. అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం మహేష్, ప్రభాస్ వార్ ఫిక్స్ అయినట్టే.