»Music Director Santhosh Narayanan Joined Project K
Project K:లో చేరిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నప్రాజెక్ట్ K(Project K) చిత్రంలో చేరినట్లు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ద్వారా ఉగాది పండుగ సందర్భంగా ప్రకటించారు. 2024 జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రాజెక్టు కె(Project K) మూవీ(movie) నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, స్వరకర్త సంతోష్ నారాయణన్(Santhosh Narayanan) పనిచేస్తున్నట్లు సంతోష్ తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా బుధవారం ప్రాజెక్ట్ K కోసం సంగీతాన్ని అందించనున్నట్లు ట్విట్టర్(twitter) వేదికగా ప్రకటించారు. మీ కలలు నిజం అయినప్పుడు ఆనందించండి అంటూ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు చెబుతూ పేర్కొన్నారు.
గతంలో ప్రాజెక్ట్ Kలో మిక్కీ జే మేయర్(mickey j meyer) స్థానంలో సంతోష్(Santhosh)ని నియమించినట్లు ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం అదే వార్త ఇప్పుడు నిజమైంది. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది 2024 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటంచారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంతోష్ అనుకున్న సమయానికి మ్యూజిక్ అందించడంతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని కూడా పూర్తి చేయడం చాలా కష్టమైన సవాలు అని పలువురు అంటున్నారు. మరోవైపు సంతోష్ ఇప్పటివరకు పనిచేసిన జోనర్ల పరిధికి వెలుపల ఉన్న ఈ సినిమా(movie) కోసం స్కోర్ చేయగల సామర్థ్యాన్ని కూడా ఇది పరీక్షించబోతోందని చెప్పవచ్చు. ప్రాజెక్ట్ K అనేది సైన్స్-ఫిక్షన్ కావడంతో, అతను ఈ తరంలో తన నైపుణ్యాలను ఎలా అన్వయించుకుంటాడో చూడాలి.
వాస్తవానికి ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు స్కోర్‌ను అందించడానికి మొదట కంపోజర్ మిక్కీ జె మేయర్‌ను తీసుకున్నారు. పలు కారణాలతో అతను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతమైన హిట్ మహానటి, అతని దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎవడే సుంబ్రమణ్యం కోసం కూడా మిక్కీ సంగీతాన్ని అందించాడు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం(nag ashwin director) వహిస్తుండగా..ఈ సినిమాలో ప్రభాస్(prabhas), దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని సహా పలువురు నటిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వని దత్ నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా డాని శాంచెజ్-లోపెజ్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.