టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం దాస్ కా దమ్కీ. అయితే ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి తానే నిర్మించడం విశేషం. తనదైన రితీలో ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కూడా ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు(మార్చి 22న)విడుదలైన దాస్ కా దమ్కీ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిత్రం: దాస్ కా ధమ్కీ
బ్యానర్: వన్మయీ క్రియేషన్స్
నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, అక్షర గౌడ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, శౌర్య కరే, అజయ్, హైపర్ ఆది, మహేష్ అంచట, మురళీ గౌడ్ తదితరులు
కథ: ప్రసన్న కుమార్ బెజవాడ
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు
ఎడిటర్: అన్వర్ అలీ
నిర్మాత: కరాటే రాజు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: విశ్వక్ సేన్
విడుదల తేదీ: మార్చి 22, 2023
ఓరి దేవుడా చిత్రం తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం దాస్ కా దమ్కీ(Das Ka Dhamki). అయితే ఈ చిత్రానికి విశ్వక్ సేన్(Vishwak Sen) దర్శకత్వం వహించి తానే నిర్మించడం విశేషం. విశ్వక్ గతంలో 2019లో “ఫలక్‌నుమా దాస్” చిత్రానికి సైతం దర్శకత్వం వహించాడు. చాలాకాలం విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఈ క్రమంలో తనదైన రితీలో ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరోవైపు విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కూడా ఈ చిత్రంపై మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు(మార్చి 22న)విడుదలైన దాస్ కా దమ్కీ మూవీ స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
కృష్ణ దాస్ (Vishwak Sen) ఒక లగ్జరీ రెస్టారెంట్లో వెయిటర్. అతను తన జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉంటాడు. ఆ క్రమంలో ఒక రోజు అతను కీర్తి (Nivetha Pethuraj)ని హోటల్లో కలిసి తనతో ప్రేమల పడతాడు. కానీ అతను తన వృత్తి గురించి వాస్తవాన్ని దాచిపెడతాడు. కీర్తిని తాను సంపన్నుడిని అని నమ్మేలా చేస్తాడు. కానీ మరోవైపు SR ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ CEO అయిన కృష్ణ దాస్ లాగా డా.సంజయ్ రుద్ర (Vishwak Sen) ఉంటాడు. ఆ కంపెనీ క్యాన్సర్ రహిత ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటూ ఒక అద్భుత ఔషధాన్ని కనిపెడుతుంది. సంజయ్ రుద్ర తన డ్రగ్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతుండగా ప్రమాదంలో చనిపోతాడు. ఇంతలోనే కీర్తి.. కృష్ణ దాస్ గురించి నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ దాస్ ఉద్యోగం కోల్పోతాడు. ఈ నేపథ్యంలోనే ఫార్మా కంపెనీని కాపాడటానికి సంజయ్ మామ (Rao Ramesh) సంజయ్ స్థానంలో కృష్ణ దాస్‌ని రావాలని కోరాతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అది కృష్ణుడి జీవితాన్ని ఎలా మార్చింది? మళ్లీ కీర్తి విశ్వక్ దగ్గరకు వస్తుందా వంటి విషయాలు తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.
కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది చాలా సినిమాల్లో చూసినదే. దీనికి తగ్గట్టుగానే సినిమాలో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ట్విస్టులు తీసుకొచ్చారు. క్లైమాక్స్ వరకు అంతులేని ట్విస్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఇక్కడే సినిమా పతనానికి దారితీసిందని చెప్పవచ్చు. ఆకస్మిక ఎడిటింగ్ కూడా ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తుంది. క్యాన్సర్ డ్రగ్ యాంగిల్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం, అందుకు సంబంధించి వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టినట్లుగా అనిపిస్తాయి.
ఎవరెలా చేశారు
అయితే ఈ చిత్రంలో విశ్వక్ తన పాత్రకు న్యాయం చేశాడని చెప్పవచ్చు. అతను తన గత చిత్రాల కంటే బెట్టర్ గా పర్మ్ ఫార్మ్ చేశాడు. దాస్ కా ధమ్కీతో విశ్వక్సేన్ కమర్షియల్ హీరో పాత్రకు కూడా సరిపోతాడని నిరూపించాడు. ఓ వైపు కృష్ణ దాస్‌గా కామెడీ టైమింగ్‌తో సినిమాను కొంచెం బ్యాలెన్స్ చేశాడని చెప్పవచ్చు. దీంతోపాటు అతను రెండు పాత్రల్లో వైవిధ్యాన్ని చూపించాడు. ఫాస్టాఫ్ మొత్తంలో ఎటువంటి స్టోరీ అనిపించదు. కొంచెం కామెడీతో నెమ్మదిగా కొనసాగుతుంది. విశ్వక్సేన్, హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్‌లకు సంబంధించిన సన్నివేశాలు బాగా వచ్చాయి. ముగ్గురూ తమ కామెడీ టైమింగ్ తో నవ్వించారు. నివేదా పేతురాజ్ దాస్ కా ధామ్కిలో చాలా గ్లామర్ పాత్రను పోషించింది. హీరోతో ఆమె కెమిస్ట్రీ అదిరిందని చెప్పవచ్చు. రొమాంటిక్ పోర్షన్స్‌లో కూడా ఫన్ యాంగిల్ చక్కగా మెయింటైన్ చేసింది. రావు రమేష్, పృధ్వి సహా తదితరులు తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు
లియోన్ జేమ్స్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో చాలా బాగా పనిచేశాడు. పడిపోయానే పిల్ల, మామా బ్రో వంటి పాటలు తెరపై బాగున్నాయి. దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయని చెప్పవచ్చు. అయితే సినిమాకి దర్శకత్వం వహించడం, నటించడం నిజంగా కష్టమైన పని ఈ చిత్రాన్ని చూస్తే చెప్పవచ్చు. విశ్వక్ దాస్ కా ధమ్కిలో నటుడిగా బాగానే యాక్ట్ చేశాడు. కానీ అతను తన దర్శకత్వ నైపుణ్యంతో పూర్తిగా మెప్పించలేకపోయాడు. అనుకున్నంత రీతిలో స్క్రీన్‌పై ప్రభావవంతంగా కనిపించలేదు. దీంతోపాటు కథలో కూడా కొత్తదనం లేదు. కొన్ని ట్విస్టులను ముందుగానే ఊహించవచ్చు.