అఖిల్(akhil akkineni) నటించిన ఏజెంట్ మూవీ(Agent movie) భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాతో ఎలాగైన సరే.. పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవాలని చాలా కష్టపడ్డాడు అఖిల్. కానీ సురేందర్ రెడ్డి ఈ సినిమాతో అఖిల్‌తో పాటు ఆడియెన్స్‌ను కూడా డిసప్పాయింట్ చేసేశాడు. అసలు అఖిల్ ఫస్ట్ సినిమా కంటే.. ఈ సినిమానే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచేలా ఉంది. ఎందుకంటే ఏజెంట్ ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే అలా ఉంది మరి పరిస్థితి.
ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాడు అఖిల్(akhil akkineni). హీరోగా ఏజెంట్ ఐదో సినిమా. ఫస్ట్ సినిమా అఖిల్‌తో మాస్ డైరెక్టర్ వివి.వినాయక్‌తో కలిసి మాస్ హీరోగా ట్రై చేశాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో కాస్త సాఫ్ట్ క్యారెక్టర్స్‌తో సినిమాలు చేశాడు అఖిల్. అయినా కూడా ఆ సినిమాలేవీ కూడా అయ్యగారికి బ్రేక్ ఇవ్వలేదు. కానీ లాస్ట్ ఫిల్మ్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో కాస్త పర్లేదనిపించుకున్నాడు. అయితే అఖిల్ మాస్ దాహం మాత్రం అలాగే ఉంది. అందుకే సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్(Agent)గా.. ఏప్రిల్ 28న ఆడియెన్స్ ముందుకొచ్చాడు.
ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేయడంతో.. ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని అనుకున్నారు. కానీ ఫస్ట్ షోకే ఏజెంట్ నెగెటివ్ టాక్(negative talk) సొంతం చేసుకుంది. దాంతో మ్యాట్నీ నుంచే ఏజెంట్ కలెక్షన్స్ డ్రాప్ అయినట్టుగా ఉంది. అందుకే ఫస్ట్ డే ఏజెంట్ వసూళ్లు కనీసం పది కోట్ల గ్రాస్ కూడా రాబట్టేలేదని చెబుతున్నాయి ట్రేడ్ వర్గాలు. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4.95 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
మామూలుగా ఏజెంట్ ప్రమోషన్స్ చూసి.. నాని దసరా కలెక్షన్స్‌ను క్రాస్ చేస్తుందని అనుకున్నారు. కానీ కనీసం అందులో సగం కూడా ఏజెంట్(Agent) రాబట్టలేకపోవడం విశేషం. దసరా మూవీకి ఫస్ట్ డే 12 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ ఏజెంట్ 10 కోట్ల గ్రాస్ మార్క్ కూడా టచ్ చేయలేదు. ఈ లెక్కన ఏజెంట్ ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. మరి 37 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఏజెంట్.. ఫైనల్ రన్లో ఎంత లాస్ అవుతాడో చూడాలి.