త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా చిత్రంతో.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు మాస్ మహారాజా రవితజ. డిసెంబర్ 23న వచ్చిన ఈ మూవీ.. కాసుల వర్షం కురిపిస్తోంది. రవితేజ కెరీర్లోనే ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రవితేజ కెరీర్లో క్రాక్ సినిమా దాదాపుగా 70 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. కానీ క్రాక్ లైఫ్ టైం కలెక్షన్లను ఫస్ట్ వీక్‌లోనే రీచ్ అయింది ధమాకా. మొదటి వారంలో 62 కోట్ల గ్రాస్ అందుకున్న ధమాకా.. 10 రోజుల్లో 89 కోట్లు రాబట్టింది. ఫస్ట్ వీక్‌లో క్రిస్మస్ హాలీడేస్ కలిసి రాగా.. సెకండ్ వీక్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసొచ్చాయి. దాంతో ధమాకా 100 కోట్లవైపు వేగంగా దూసుకెళ్తోంది. ఈ వీకెండ్ వరకు మాస్ మహారాజా 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు సంక్రాంతి వరకు మరో పెద్ద సినిమా థియేటర్లో లేదు కాబట్టి.. రవితేజదే హవా అంటున్నారు. ఇక ఈ సినిమా విజయానికి కథ కాకుండా.. పలు అంశాలు కలిసొచ్చాయి. రవితేజ నుంచి 2022లో వరుస ఫ్లాపులు వచ్చాయి. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ.. ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. దాంతో మాస్ రాజా ఫ్యాన్స్.. తమ హీరో జస్ట్ ఎంటర్టైన్ చేస్తే చాలని ఎదురు చూశారు. అందుకు తగ్గట్టే.. ధమాకా కథ, కథనం కొత్తది కాకపోయినా.. రవితేజ ఎనర్జిటిక్ ఫర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చేసింది. దానికి తోడు శ్రీలీల గ్లామర్, పాటలు, డాన్సులు, ఫైట్లు ఇలా అన్నీ విధాలుగా ధమాకాకు కలిసొచ్చింది. దాంతో రవితేజ కెరీర్లో రికార్డ్ కలెక్షన్లు రాబడుతున్నాడని చెప్పొచ్చు. ప్రస్తుతం రవితేజ రావణసుర, టైగర్ నాగేశ్వర రావు వంటి సినిమాలు చేస్తున్నాడు. ధమాకాతో 100 కోట్ల క్లబ్లో చేరితే మాత్రం.. ఈ సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవడం పక్కా. పైగా టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. మొత్తంగా ధమాకా మాస్ రాజాకు భారీ విజయాన్ని అందించిందని చెప్పొచ్చు.