క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌కు టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా మంది కుర్రాళ్లకు అనుపమే కలల రాణి. అందుకే సోషల్ మీడియాలో ఫాలో అవుతూ.. అమ్మడి గురించి నిత్యం ఆరా తీస్తుంటారు. అను కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంటుంది. అలాంటి ఈ బ్యూటీ.. ఇక పై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తోందట. నిత్యం సోషల్ మీడియాలో హీరోయిన్లపై ట్రోల్స్, బ్యాడ్ కామెంట్స్ వస్తునే ఉంటాయి. ఆ మధ్య అనుపమా పై కూడా ట్రోలింగ్ జరిగింది. దాంతో సోషల్ మీడియాకు దూరం కావాలనే ఆలోచనలో ఉందట అనుపమ. ఈ విషయంలో ఆమె అభిమానులు కాస్త డసప్పాయింట్ అవుతున్నారు. సోషల్ మీడియా అన్నాక ఆ మాత్రం ఉంటది.. అందులో హీరోయిన్లు యాక్టివ్‌గా లేకపోతే.. కష్టమంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. నిఖిల్ సరసన అనుపమా నటించిన 18 పేజెస్ మూవీ ఈ వారం థియేటర్లోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా.. తనకు డైరెక్షన్ చేయాలని ఉందని చెప్పింది అను. అతి త్వరలోనే మెగా ఫోన్ పట్టడం పక్కా అని చెప్పుకొచ్చింది. అందుకోసం నటనకు ఒక ఏడాది పాటు గ్యాప్ తీసుకోవాలి అనుకుంటున్నానని.. చెప్పుకొచ్చింది. ఈ విషయంలోను ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. డైరెక్షన్ చేసినా.. యాక్టింగ్‌కి దూరం కావొద్దని అంటున్నారు. ఇకపోతే కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న అనుపమా.. త్వరలోనే బట్టర్ ఫ్లై చిత్రంతో ఓటిటిలోకి సందడి చేసేందుకు రెడీ అవుతోంది. అలాగే టిల్లు స్క్వేర్తో పాటు ఇంకొన్ని సినిమాల్లోను నటిస్తోంది.