Akkineni Akhil : ‘ఏజెంట్’ కోసం అఖిల్ ఫస్ట్ టైం అలా చేస్తున్నాడు!
Akkineni Akhil : ఇప్పటివరకు చేసిన సినిమాల్లో.. చాలా వరకు సాఫ్ట్‌గానే కనిపించాడు అక్కినేని అఖిల్. కానీ ఏజెంట్ మూవీ కోసం బీస్ట్ లుక్‌లోకి మారిపోయాడు. ఇప్పటికే సాలే నహీ.. వైల్డ్ సాలే బోల్.. అని టీజర్‌తో చెప్పకనే చెప్పేశాడు. అసలు ఏజెంట్ మూవీలో అఖిల్ మేకోవర్ చూసి.. ఇది కదా కటౌట్ అంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు.
ఇప్పటివరకు చేసిన సినిమాల్లో.. చాలా వరకు సాఫ్ట్‌గానే కనిపించాడు అక్కినేని అఖిల్. కానీ ఏజెంట్ మూవీ కోసం బీస్ట్ లుక్‌లోకి మారిపోయాడు. ఇప్పటికే సాలే నహీ.. వైల్డ్ సాలే బోల్.. అని టీజర్‌తో చెప్పకనే చెప్పేశాడు. అసలు ఏజెంట్ మూవీలో అఖిల్ మేకోవర్ చూసి.. ఇది కదా కటౌట్ అంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘ఏజెంట్’ను స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. అందుకే చాలా రోజులుగా ఈ సినిమాను చెక్కుతునే ఉన్నాడు. అఖిల్ కూడా చాలా రిస్క్ తీసుకుంటున్నాడు. అయితే చాలా కాలంగా డిలే అవుతున్న ఈ సినిమాను.. ఎట్టకేలకు ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు.. ఇటీవలె ప్రకటించారు. సినిమా రిలీజ్‌కు ఇంకో రెండు నెలలకు పైగానే సమయం ఉంది. కానీ అప్పుడే అఖిల్ రంగంలోకి దిగిపోయాడు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా కూడా మారాడు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నెల 22న ట్విట్టర్ స్పేస్‌లో అభిమానులతో తొలిసారి ఇంట్రాక్ట్ కానున్నాడు. ఫస్ట్ టైం అఖిల్ ఇలా చేస్తున్నాడని.. ఏజెంట్ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ చిట్ చాట్‌లో ఏజెంట్ మూవీ గురించిన పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకోబోతున్నాడు అఖిల్. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఆ మూమెంట్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఏజెంట్ ఎలాంటి కొత్త కబుర్లు చెబుతాడో చూడాలి.