»Actress Producer Kaumudi Nemani Exclusive Interview With Dev Tompala Sarvam Shakthi Mayamhittv
Kaumudi Nemani: ఇలాంటి సినిమాలు చేసినందుకు గర్వపడుతున్నా
సింగర్‌గా, యాక్టర్‌గా పరిచయం ఉన్న కౌముది నేమని నిర్మాతగా వ్యవహరించిన తాజా వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం. సక్సెస్‌ఫుల్‌గా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను 'హిట్ టీవీ' ప్రేక్షకులతో పంచుకున్నారు.
Actress & Producer Kaumudi Nemani Exclusive Interview With Dev Tompala | Sarvam Shakthi Mayam|Hittv
Kaumudi Nemani: మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నప్పటి నుంచే ప్రొడక్షన్ అంటే ఇష్టమని, అందుకే ముందు ప్రేక్షకులకు తెలియాలని నటీగా, సింగర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు నిర్మాతగా మారానని కౌముది నేమని(Kaumudi Nemani) అన్నారు. శక్తిపీఠాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ సిరీస్‌లో చూపించామని తెలిపారు. సినిమా కోసం దేశంలోని 18 లోకేషన్లలో ఈ సిరీస్ షూటింగ్ చేసినట్లు చెప్పారు. అదే సమయంలో హీరోయిన్ ప్రియమని కోసం మూడు నెలలు వెయిట్ చేశామని, ఫస్ట్ హిందీలో విడుదల చేశామని, అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఇక ఈ సినిమా చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చిందని వెల్లడించారు. పరిశ్రమలో ఫీమేల్ ప్రొడ్యూసర్స్ తక్కువగానే ఉన్నప్పటికీ తనకు చాలా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నారు. ఇక ఇండస్ట్రీలో తన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇక సర్వం శక్తి మయం సిరీస్‌లో చాలా ప్యాడింగ్ ఆర్టిస్ట్‌లు ఉన్నారని, వాళ్ల డేట్స్ ఎలా హ్యాండిల్ చేశారో వివరించారు. ఇక చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి తెలిపారు. పరిశ్రమలో సక్సెస్ అవ్వాలి అంటే ఆ ఒక్కటి నమ్మితే చాలు అని కౌముది అన్నారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు. మరి ఆ విషయాలు గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.