Divya Narni: కాలేజీ సమయంలో వంగవీటి సినిమాలో సెలక్ట్ అయినట్లు నటి దివ్వ నార్ని(Divya Narni) తెలిపారు. ఆ తరువాత ఆర్ఎక్స్100(RX100) సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పారు. యాడ్ షూట్స్ అయినా, సినిమా, వెబ్ సిరీస్ ఏది అయినా సరే నటించడం ఇష్టమని పేర్కొన్నారు. కేవలం సినిమాలే కాకుండా తాను ఐటీ జాబ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మాయి బాగుంటే ఛాన్సెస్ ఊరికే రావు అని, పరిచయాలు కచ్చితంగా ఉపయోగపడుతాయని దివ్య నార్ని చెప్పారు. పరిశ్రమలో పని చేయడం ఈజీ జాబ్ కాదని, ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తున్నానని పేర్కొన్నారు. ఇక తన లైఫ్లో వచ్చి ప్రపొజల్స్ గురించి తెలిపారు. ఢీ(Dhee) సెట్లో హైపర్ ఆది ఎలా ఉంటారో, ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటారో వివరించారు. తన తరువాత సినిమాల గురించి చెప్పారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.