Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేషరాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 11వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఈ రాశివారికి ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయకం జరుగుతుంది. 3.33 గంటల నుంచి చంద్రుడు 12వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున వృత్తిపరమైన రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో అనుకోని ఖర్చులు ఉండే అవకాశం ఉంది.
వృషభ రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 10వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, ఆరోగ్య, కుటుంబం విషయాల్లో బాగుంటుంది. తదుపరి రాత్రి 3.33 గంటల నుంచి 11వ ఇంటకు (సానుకూలం) మారుతున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో మంచి జరుగుతుంది.
మిథున రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 9వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున చిన్న చిన్న నష్టాలు, వివాదాల కారణంగా మానసిక ఒత్తిడి, దిగులుకు గురయ్యే అవకాశం ఉంది. తదుపరి చంద్రుడు రాత్రి 3.33 గంటల నుంచి 10వ ఇంటకు (సానుకూలం) మారుతున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో గణనీయమైన సాఫల్యత కనిపిస్తుంది.
కర్కాటక రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 8వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున కొన్ని ఆర్థిక అంశాలు, కుటుంబ విషయాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తదుపరి రాత్రి 3.33 గంటల నుంచి చంద్రుడు 9వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున కొన్ని నష్టాలు, కుటుంబ వివాదాల కారణంగా మానసిక ఒత్తిడికి, బాధలకు గురయ్యే అవకాశం ఉంది.
సింహ రాశి: చంద్రుడు 3.33 గంటల వరకు 7వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో సాఫల్యత ఉండే అవకాశం ఉంది. తదుపరి రాత్రి 3.33 గంటల నుంచి చంద్రుడు 8వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున కొన్ని ఆర్థిక నష్టాలు, వృత్తిపరమైన అంశాలతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
కన్య రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 6వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, గృహ, ఆరోగ్య విషయాల్లో బాగుంటుంది. రాత్రి 3.33 గంటల నుంచి చంద్రుడు 7వ ఇంటకు (సానుకూలం) మారుతున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ, ఆరోగ్య విషయాల్లో కూడా మంచి జరిగేందుకు ఆస్కారం ఉంది.
తులా రాశి: చంద్రుడు 3.33 గంటల వరకు 5వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్న స్వల్ప నష్టాలు, వృత్తిపరమైన విషయాల కారణంగా మానసిక వేదన కలిగే అవకాశం ఉంది. తదుపరి చంద్రుడు 6వ ఇంట ప్రవేశిస్తున్నందున ఆర్థిక, గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో గణనీయమైన సాఫల్యతను ఆశించవచ్చు.
వృశ్చిక రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 4వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున చిన్నచిన్న నష్టాలు, వివాదాలు, శత్రుత్వం కలుగవచ్చును. తదుపరి రాత్రి 3.33 గంటల నుంచి చంద్రుడు 5వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున చిన్నపాటి నష్టాలు, వాదాల కారణంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
ధనస్సు రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 3వ ఇంట (సానుకూలం) ఉంటున్నందన ఖర్చులు తగ్గడంలో సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాత్రి 3.33 గంటల నుంచి చంద్రుడు 4వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున అన్ని విషయాల్లో స్వల్ప సమస్యలు ఎదురయ్యే కారణంగా వివాదాలు, శత్రుత్వం కలిగే అవకాశం ఉంది.
మకర రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 2వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున కొన్ని నష్టాలు, కుటుంబ విషయాల వల్ల కొంత మానసిక ఒత్తిడి, దిగులు ఉండే అవకాశం ఉంది. తదుపరి రాత్రి 3.33 గంటల నుంచి చంద్రుడు 3వ ఇంటకు (సానుకూలం) మారుతున్నందున వృత్తి, వ్యాపార రంగాల్లో పరిస్థితి కొంత మెరుగవనుంది.
కుంభ రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 1వ ఇంట (సానుకూలం) ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాత్రి 3.33 గంటల నుంచి చంద్రుడు 2వ ఇంటకు (ప్రతికూలం) మారుతున్నందున స్వల్ప ఆర్థిక నష్టాలు, వివాదాల కారణంగా మానసిక ఒత్తిడికి, దిగులుకు గురయ్యే అవకాశం ఉంది.
మీన రాశి: చంద్రుడు రాత్రి 3.33 గంటల వరకు 12వ ఇంట (ప్రతికూలం) ఉంటున్నందున వృత్తి, వ్యాపార విషయాల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. తదుపరి రాత్రి 3.33 గంటల నుంచి చంద్రుడు 1వ ఇంటకు మారుతున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సానుకూల సందర్భాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.