Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధు, మిత్రుల మర్యాద పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. కోలిగ్స్ సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఉంటాయి.
వృషభ రాశి
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళన వెళ్లేందుకు ధ్యానం చేయాలి. అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తోంది. ధన వ్యయం ఉంటుంది.
మిథున రాశి
ఆకస్మిక ధన లాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. రుణం నుంచి విముక్తి కలుగుతుంది. మానసిక ఆనందం పొందుతారు.
కర్కాటక రాశి
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన గృహకార్యాలపై ఫోకస్ చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికం అవుతాయి.
సింహ రాశి
కొత్త వ్యక్తులను నమ్మి మోసపోవద్దు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనం కోసం ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
కన్య రాశి
బంధు, మిత్రుల సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసరంగా భయపడతారు.
తుల రాశి
స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణం కోసం ప్రయత్నిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
వృశ్చిక రాశి
అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
ధనుస్సు రాశి
కుటుంబ కలహాలు దూరం అవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. స్వల్పంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.
మకర రాశి
సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటి వారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలకు మనోల్లాసం కలుగుతుంది.
కుంభ రాశి
వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
మీన రాశి
ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది.