మేష రాశి
వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త పడటం తప్పనిసరి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులు చేయవద్దు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.
వృషభ రాశి
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.. అయినప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. శుభ వార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శివుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు దూరం అవుతాయి.
మిథున రాశి
కళాకారులు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబ హ్యాపీగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. లక్ష్మీసహస్రనామ పారాయణం చేయండి.
కర్కాటక రాశి
రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. లక్ష్మీదేవిని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. కొత్త పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. కొన్ని మాటల వల్ల ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండాలి. వేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.
కన్య రాశి
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇష్టదేవతను దర్శించుకుంటారు.
తుల రాశి
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతివిషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
వృశ్చిక రాశి
మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృ బాధలు తొలగిపోతాయి. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనుస్సు రాశి
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.
మకర రాశి
బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభ రాశి
మిశ్రమ వాతావరణం ఉంటుంది. విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచించి వ్యవహరిస్తే మంచి కలుగుతుంది. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీన రాశి
ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు.