ఆవు పాలు (cow milk), స్వచ్ఛమైన నీటితో (water) శివలింగం అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసే సమయంలో శరీరంపై ఉన్న చెమట, వెంట్రుకలు శివుడిపై పడకూడదు. శివరాత్రి పర్వదినాన మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయాలనే నియమం ఏమీ లేదు. నిష్టగా శివుని ఆరాధించే వారికి ఆయన అనుగ్రహం కలుగుతుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ (Alampur ) బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత( Mlc kavitha) దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి( Balabrahmeshwar) ప్రత్యేక పూజాలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకూంభంతో స్వాగతం పలికారు.
Bilva pathram:మహా శివరాత్రి.. (shivaratri) హిందువుల ముఖ్యమైన పండుగ. ఇంట్లో పూజ చేసే వారు గోగుపూలు, మారేడు, బిల్వ (bilva) దళాలను సమర్పిస్తారు. వీటిలో బిల్వ పత్రం శ్రేష్టం అని పురాణాలు చెబుతున్నాయి. బిల్వ దళంలో మూడు ఆకులు ఉంటాయి. అవీ సత్త్వ, రజ, తమో గుణాలు.. ఇవీ శివుని మూడు నేత్రాలకు ప్రతీక.. త్రిశూలానికి సంకేతం.
Maha shivaratri:మహా శివరాత్రి.. (Maha shivaratri) హిందువులకు ప్రధాన పండుగ. ఈ రోజే శివుడు (lord shiva) లింగాకారంలో ఆవిర్భవించారు. శివుడు గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి (Maha shivaratri) అని కూడా చెబుతుంటారు. అందుకే భక్తులు ఉపవాసం ఉంటారు.. మరికొందరు జాగారం చేస్తారు.
మహాశివరాత్రి (Mahashivratri) సందర్బంగా భక్తులకు (TS RTC) టీఎస్ ఆర్టీసీ గూడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ (Kondagattu) కొండగట్టు పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా సీఎం బుధవారం కొండగట్టులో పర్యటించన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. సీ ఎం పర్యటన నేపధ్యంలో సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. శ్రీశైలంలో రోజురోజుకూ భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. నేటి సాయంకాలం హంస వాహనం పై శ్రీశైల(Srisailam) ఆది దంపతులు ఊరేగనున్నారు.
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమల(Tirumala)కు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో ఆదివారం భక్తులతో కొండపై ఉన్న కంపార్టెమెంట్లన్నీ నిండిపోయాయి.
మహాశివరాత్రి(Maha Shivratri) సందర్భంగా దేశంలోని శివాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. పండగ సందర్భంగా శ్రీశైలంలో ఫిబ్రవరి 11వ తేది నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ప్రారంభమయ్యాయి.
వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడను మరో యాదాద్రి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మహా శివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్రం అభివృద్ధి పైన మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తో అలాగే అధికారులతో సమీక్షించారు.
రామ భక్తులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ శుభవార్త తెలియజేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా… ఈలోపే.. ఆలయం మాత్రమే కాదు.. ఆలయంలోకి వెళ్లే మార్గాలు సైతం ఆకర్షణీయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. రామజన్మ భూమిలోని రామాలయానికి వెళ్లే మూడు దారుల్లోని నివాస, వాణిజ్య భవనాలు ఏకరీతిగా ఉండేలా తీర్చిదిద్దబోతోంది. దీని కోసం 2023లో సుమా...
శ్రీశైల మహాక్షేత్రంలో పిబ్రవరి 11 నుంచి 21 తేదీ వరుకు మహాశివ రాత్రి బ్రహ్మొత్సవాలు నిర్వహించనున్నారు. భూకైలాసంగా ప్రసిద్ది చెందిన ఈ దివ్యక్షేత్రంలో 11 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 11న ప్రత్యేక పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం అంకురార్పణ అనంతరం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తా...
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటను రిలీజ్ చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఫిబ్రవరి నెలోని 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఆర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ తేదీలకు సంబంధించిన ఆర్జిత సేవా లక్కీ డిప్ టిక్కెట్లు ఈనెల 8వ తేదీ ఉదయం 10 గంటలనుంచి...
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీవారిని 57,147 మంది దర్శించుకున్నారు. అలాగే 26,094 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇకపోతే రేపు రామకృష్ణ తీర్...
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోనులు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ భారీ దాతృత్వం ప్రకటించింది. రూ.22 కోట్లు విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ మేరుకు టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవి ధర్మారెడ్డి సమక్షంలో ఐఓసీఎల్ ,స్విమ్స్ అధికారుల మధ్యలో ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మ...