»Due To Bad Weather And Heavy Snowfall Kedarnath Yatra Registrations Suspended
Char Dham yatra : నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు
ప్రస్తుతం కేదరనాథ్ లో భారీ వర్షాలు, హిమపాతం కురుస్తోంది. ఈ కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్(Registration) ను ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తుందనీ, తదనుగుణంగా భక్తుల రక్షణ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుందని చార్ ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు.
Char Dham yatra : అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి(Gangotri, Yamunotri) ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఏప్రిల్ 25న కేదార్ నాథ్ ఆలయ ద్వారాలు, బద్రీనాథ్(Badrinath) ఆలయాన్ని ఏప్రిల్ 27న భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. చార్ ధామ్ యాత్ర(Char Dham yatra) కోసం దేశవిదేశాలకు చెందిన సుమారు 16 లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నట్లు అధికారుల వెల్లడించారు. యాత్రికుల కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ పూర్తి ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కేదరనాథ్ లో భారీ వర్షాలు, హిమపాతం కురుస్తోంది. ఈ కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్(Registration) ను ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తుందనీ, తదనుగుణంగా భక్తుల రక్షణ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుందని చార్ ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం(Uttarakhand Govt) ఆదివారం తీర్థయాత్రకు సంబంధించి అడ్వైజరీని జారీ చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలనీ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమ యాత్రను ప్రారంభించాలని కోరింది. కేదార్ నాథ్(Kedarnath)లో వర్షాలు, హిమపాతం పరిస్థితులు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చే భక్తులందరూ యాత్రకు బయలు దేరే ముందు వాతావరణ పరిస్థితులను పరిశీలించాలని కోరుతున్నారు. అలాగే, వీలైనంతవరకు వెచ్చని దుస్తులను తీసుకెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ప్రయాణీకులు ప్రయాణ సమయంలో పర్వత వాతావరణానికి తమ శరీరాలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఇబ్బందులు ఎదురైతే కాసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే ప్రయాణం చేయాలన్నారు. యాత్రికుల సంఖ్య, రద్దీ నిర్వహణ కోసం ఆన్ లైన్(online), ఆఫ్ లైన్(Offline) లో యాత్రికుల నమోదు కొనసాగుతుందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు.