అన్ని వేళల్లో సహనం ప్రదర్శించాలి. ఆర్థిక ఇబ్బందులు కొంత ఎదురవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగన్నామస్మరణ మరువద్దు.
శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం చతుర్ధి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి సోమవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: కుటుంబ పరిస్థితులు మానసిక ఆందోళనకు గురి చేస్తాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. స్థిరమైన ఆలోచనతో ఉంటే మేలు జరుగుతుంది. విష్ణు నామస్మరణ చేస్తే అంతా శుభాలు కలుగుతాయి.
వృషభం:శుభకార్యాలు జరుగుతాయి. కానీ ధన నష్టం అధికంగా జరుగుతుంది. ప్రయాణాలు చేస్తారు. ఒక శుభవార్త మీలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దైవరాధన చేయాలి.
మిథునం:వృత్తి, ఉద్యోగ రీత్యా గౌరవ, మర్యాదలు దక్కుతాయి. మానసికోల్లాసాన్ని పొందుతారు. మీ దృఢ సంకల్పంతో పనులు పూర్తి చేసుకుంటారు. కొన్ని అంశాలు మానసిక ఆందోళనకు గురి చేస్తాయి. అకాల ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. గణపతి స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది.
కర్కాటకం: కుటుంబ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. చేపట్టిన పనులు కొంత అవాంతరాలు ఎదురవుతాయి. ఇతరులతో గౌరవించబడుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా మెలుగుతారు. ఇష్ట దేవతను స్మరించుకోవాలి.
సింహం: ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టకూడదు. ప్రయాణాలు చేస్తారు. ఓ విషయంలో కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించాలి.
కన్య: స్వల్ప విషయాలకు ఆందోళన చెందుతారు. వృత్తి, ఉద్యోగ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. సహనం ప్రదర్శించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు.. దూకుడుతో వ్యవహరించకూడదు. దుర్గాదేవిని ఆరాధించాలి.
తుల: బంధుమిత్రులతో బేధం ఏర్పడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయంలో మనస్తాపానికి లోనవుతారు. ఒత్తిడితో మానసిక సంఘర్షణకు లోనవుతారు. ముఖ్యమైన బాధ్యతలు పెరుగుతాయి. లలిత సహస్రనామ పారాయణం చేయాలి.
వృశ్చికం:ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. పడిన కష్టానికి ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందంలో ముంచుతుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. లక్ష్మిదేవి అష్టోత్తరం చదవాలి.
ధనుస్సు: అన్ని వేళల్లో సహనం ప్రదర్శించాలి. ఆర్థిక ఇబ్బందులు కొంత ఎదురవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయ స్తోత్రం పఠించాలి.
మకరం: కుటుంబంలో విబేధాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీదైనా తెలివితేటలతో సమస్యలు పరిష్కరించి ప్రశంసలు పొందుతారు. ఇష్టదైవాన్ని సందర్శించుకుంటే మేలు జరుగుతుంది.
కుంభం: వృత్తి, వ్యాపారం, ఉద్యోగం విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అభివృద్ధి ఉంటుంది. కొంత మానసిక ఆందోళన కలిగిస్తుంది. తీసుకునే స్థిరమైన నిర్ణయాలకు ఫలితం లభిస్తుంది. వినాయకుడి అష్టోత్తర శతనామావళి పఠించాలి.
మీనం: ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉంటాయి. అనవసరమైన విషయాల్లో భయాందోళన తొలగిపోతుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.