మంగళవారం మంగళకరమైన రోజు.. ఈ రోజు చాలా మంది రాశుల వారికి శుభం జరుగుతుంది. కాకపోతే కొంత జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజును అద్భుతంగా పూర్తి చేసుకోవచ్చు.. అవేంటో తెలుసుకోండి..
అన్ని వేళల్లో సహనం ప్రదర్శించాలి. ఆర్థిక ఇబ్బందులు కొంత ఎదురవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగన్నామస్మరణ మరువద్దు.
ప్రస్తుతం కేదరనాథ్ లో భారీ వర్షాలు, హిమపాతం కురుస్తోంది. ఈ కారణంగా కేదార్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్(Registration) ను ఏప్రిల్ 30 వరకు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. వాతావరణ పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తుందనీ, తదనుగుణంగా భక్తుల రక్షణ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుందని చార్ ధామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరేంద్ర సింగ్ కవిరియాల్ తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతో నకిలీ వెబ్సైట్ను పోలీసులు గుర్తించారు. సంబంధింత వెబ్సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచించింది.
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద (Swaroopananda Swamy) విమర్శించారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
Akshaya Tritiya రోజు బంగారం కొనలా వద్దా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. దీంతోపాటు అనేక ధర్మ సందేహాలను మీరు తీర్చుకునే అవకాశం ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకు(bank)లో డిపాజిట్(Deposit) చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.
షిర్డీ ఆలయానికి (Shirdi temple) చెందిన శ్రీ సాయిబాబా సంస్దాన్ టస్ట్ర్, RBI ని ఆశ్రయించింది. బ్యాంకులు నాణేలు స్వీకరించలేదని ట్రస్ట్ RBI కి లేఖ రాసింది