బాపట్ల జిల్లాలో సుందరవల్లి సమేత క్షీరభావన్నారాయణ స్వామి(Bhavanarayana Swamy) బ్రహ్మోత్సవాలు(Bramhotsavams) వేడుకగా జరుగుతున్నాయి. బాపట్లలో క్రీ.శ.594లో క్రిమికంఠీరవ చోళ మహారాజు నిర్మించిన ఆలయంలో భావన్నారాయణుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. సుందరవల్లి సమేత క్షీరభావన్నారాయణ స్వామి(Bhavanarayana Swamy) 1430వ వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి వారి రథాన్ని లాగారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆలయానికి విచ్చేసి స్వామి రథాన్ని లాగారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అధికారులు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథాన్ని లాగుతున్న భక్తులు: