»Telangana Bonalu Festival Starts From June 24 In Hyderabad
Telangana బోనాల తేదీలు ఖరారు.. ఇక హైదరాబాద్ లో సందడే సందడి
మన రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ బోనాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల పండుగ చూసేందుకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల ప్రజలు తరలివస్తారు. ఆషాఢ మాసం మొత్తం తెలంగాణలో కోలాహల వాతావరణం ఉంటుంది.
తెలంగాణలో (Telangana) ఆషాఢ మాస బోనాలు (Bonalu) అంగరంగ వైభవంగా జరుగుతాయి. మన రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ బోనాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల పండుగ చూసేందుకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల ప్రజలు తరలివస్తారు. ఆషాఢ మాసం (Ashada Masam) మొత్తం తెలంగాణలో కోలాహల వాతావరణం ఉంటుంది. అలాంటి రాష్ట్ర ఉత్సవం తేదీలు ఖరారయ్యాయి. జూన్ 24వ తేదీ నుంచి జూలై 16 వరకు ఉత్సవాలు (Utsav) జరుగనున్నాయి.
తెలంగాణ రాష్ట్రమొచ్చాక బోనాల ఉత్సవాలు రాష్ట్ర పండుగగా (State Festival) గుర్తింపు దక్కింది. తెలంగాణ సంస్కృతికి (Telangana Culture) ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. అన్ని శాఖల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగనున్నాయి. వీటిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahakali) ఆలయం ప్రతినిధులతో కలిసి జాతర తేదీలను ఖరారు చేశారు.
జూన్ 24న తొలి బోనం గోల్కొండ కోటలో (Golconda Fort) జగదాంబిక అమ్మవారికి సమర్పణ సికింద్రాబాద్ బోనాలు
జూలై 9వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు
10వ తేదీన రంగం (భవిష్య వాణి)
సికింద్రాబాద్ లో బోనాలు జరిగిన అనంతరం హైదరాబాద్ లో ఉత్సవాలు జరుగుతాయి. లాల్ దర్వాజలో (Laldarwaza) అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. తాగునీరు, పారిశుద్ధ్యం, ఆలయాల అలంకరణ వాటిపై జీహెచ్ఎంసీతో (GHMC) కలిసి చర్యలు తీసుకోనుంది. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. కాగా గతేడాది బోనాల ఉత్సవాలకు సీఎం కేసీఆర్ (KCR), కేంద్ర మంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే.