శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం తదియ ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి సోమవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం:పని భారం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు ఎదురుచెప్పకూడదు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
వృషభం: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఆనందాలు నిండుతాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.
మిథునం: అసంపూర్తి పనులు పూర్తవుతాయి. దుబారా ఖర్చులు చేయొద్దు. కుటుంబసభ్యులతో ప్రేమాప్యాయతలతో ఉంటారు. సాయి నామస్మరణ చేయాలి.
కర్కాటకం: ఈ రాశివారికి శుభాలే జరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి.
సింహం:సమాజంలో గౌరవ, మర్యాదలు దక్కుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సూర్య నారాయణమూర్తిని ఆరాధించాలి.
కన్య:ఆకస్మిక ధన లాభం ఉంటుంది. శుభవార్త వింటారు. దుర్గ స్తోత్రం పఠించాలి.
తుల: ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాల జోలికి వెళ్లవద్దు. ఊహించని విజయాలు పొందుతారు. శివుడిని పూజించాలి.
వృశ్చికం: సానుకూల వాతావరణం ఉంటుంది. శుభవార్త వింటారు. ముఖ్యమైన విషయాలపై తోటి మిత్రులతో చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పఠించాలి.
ధనుస్సు: ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈశ్వరుడిని ధ్యానం చేయాలి.
మకరం:కొత్త పనులు చేపట్టవచ్చు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేయాలి.
కుంభం: ఈ రాశివారికి శుభకాలం ఉంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి పొందుతారు. ఓ శుభవార్త ఇంటిల్లిపాదిని ఆనందంలో ముంచుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యాల్లో పాల్గొంటారు. కనకధారాస్తవం పఠించాలి.
మీనం:ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగి అంతా మంచి జరుగుతుంది.