తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు(Devotees) తరలివస్తుంటారు. భక్తుల పరిరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు పలు రకాల చర్యలు చేపడుతుంటారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ సీసాల(Plastic Bottles)ను టీటీడీ నిషేధించింది. వాటి స్థానంలో ఇప్పుడు గాజు సీసాలను భక్తులకు అందిస్తోంది. దీంతో గాజు సీసాల(Glass Bottles) నీటి ధర రూ.60లకు విక్రయించడంతో సామాన్య భక్తులకు భారంగా మారింది.
గాజు సీసా(Glass Bottles) ఖాళీది తిరిగి దుకాణాల్లో ఇస్తే రూ.35లు భక్తులకు వెనక్కు ఇస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తూ గాజు సీసా పగిలిపోతే వాటికి ఎటువంటి డబ్బులు ఇవ్వరు. ఈ టైంలోనే తిరుమలలో రాగి, స్టీల్ మంచినీటి సీసాలను టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే రాగి నీటి సీసా ధర రూ.450లు, స్టీల్ సీసా ధర రూ.200లు కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తిరుమల కొండకు వెళ్లే ముందు అలిపిరి తనిఖీ కేంద్రంలో ప్లాస్టిక్ సీసాలను అధికారులు అనుమతించడం లేదు.
టీటీడీ(TTD) సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్ల(Plastic Bottles)ను తిరుమల కొండకు కిందే తీసి పడేస్తున్నారు. దీంతో భక్తులు స్టీల్, రాగి నీటి సీసాలను వాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సమస్యలకు టీటీడీ స్వస్థి చెప్పాలనుకుంటోంది. సరసమైన ధరల్లో వెదురుతో తయారు చేసిన నీళ్ల సీసాల(Bamboo Bottles)ను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వెదురుబొంగు సీసాల(Bamboo Bottles)ను ఒరిస్సాలో తయారు చేసి వాటిని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు టీటీడీ(TTD) ప్రణాళికలు వేస్తోంది. త్వరలోనే ఇవి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.