KA PAUL:ప్రజా శాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ (KA PAUL) మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 60 నుంచి 70 శాతం ప్రజలు తనను సీఎంగా (CM) కోరుకుంటున్నారని అన్నారు. తనను తాను కేజ్రీవాల్‌తో (Kejriwal) పోల్చుకున్నారు. సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించరని అడిగారు. త్వరలో 8 లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకొస్తానని చెప్పారు.
రాష్ట్రంలో అవినీతి పెరుకుపోయిందని చెప్పారు. నాలుగేళ్లలో సిట్ (sit) ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీబీఐ ఎంక్వైరీ (cbi enquiry) కూడా చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణకు (botsa satya narayana) లక్ష కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయని ఆరోపించారు. బొత్స (botsa) ఆస్తులపై సిట్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఏపీలో తిరిగి చంద్రబాబు నాయుడు (chandrababu) అధికారంలోకి వస్తే మింగేస్తాడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయం తాను బీజేపీకి చెప్పానని వివరించారు. వైసీపీలో అవినీతి పరులని విచారించాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో అక్రమాలు, అప్పులు మాత్రం పెరిగాయని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ భారీ మెజార్టీతో అధికారం చేపడుతుందని కేఏ పాల్ (KA PAUL) విశ్వాసంతో ఉన్నారు. వైసీపీపై వ్యతిరేకత.. టీడీపీపై జనానికి విశ్వాసం లేదని చెబుతున్నారు. ఈ మధ్య జరిగిన మునుగోడు బై పోల్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఫస్ట్ ప్లేస్‌లో తానే ఉంటానని చెప్పి.. ఆ తర్వాత జాడ లేకుండా పోయారు. ఇప్పుడు కూడా అంతేనని మిగతా నేతలు అంటున్నారు.