శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం విధియ ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి ఆదివారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: మానసిక ప్రశాంతత ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే ప్రమాదం ఉంది. మనోబలంతో ఉండాలి. ఎవరితో వాదోపవాదాలు చేయకూడదు. సూర్యచంద్రులను ఆరాధించాలి.
వృషభం: ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. కొన్ని కీలకమైన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా పరిస్థితులు కలిసి వస్తాయి. గణపతి ధ్యానం తప్పనిసరిగా చేయాలి.
మిథునం: క్షణికావేశానికి లోను కావొద్దు. అనర్థాలు జరుగుతాయి. ధన నష్టం తొలగేందుకు రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అవసరానికి అందరూ సహాయ పడతారు. ఇష్టదైవ నామస్మరణ చేయాలి.
కర్కాటకం: చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆదిగురు శివుడిని పూజించాలి.
సింహం: పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త పనులు ప్రారంభించవద్దు. ఇంట్లో జరిగే మార్పులతో ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. శివుడిని దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు దక్కుతాయి.
కన్య: మానసిక ఆందోళనకు గురవుతారు. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహం దరి చేరనీయవద్దు. కొన్ని సంఘటనలు మానసిక వేదనకు గురి చేస్తాయి. భగవన్నామస్మరణను మరువకూడదు.
తుల:కుటుంబంలో అనారోగ్య బాధలు కలుగుతాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడే ప్రమాదం ఉంది. ఖర్చులు పెరగకుండా అప్రమత్తంగా ఉండాలి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి.
వృశ్చికం:ఆకస్మిక భయాందోళనల నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో మనశ్శాంతి కొరవడుతుంది. బంధుమిత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. శివ అష్టోత్తర శతనామావళి పఠిస్తే అంతా శుభం జరుగుతుంది.
ధనుస్సు: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తలు వింటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించాలి.
మకరం:కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తారు. పరమేశ్వరుడిని దర్శించుకోవాలి.
కుంభం: మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. కుటుంబంలో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. సూర్య ఆరాధన చేయాలి.
మీనం:చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. నిర్లక్ష్యాన్ని తొలగించుకుంటే మరింత విజయం సాధిస్తారు. శివుడిని ధ్యానం చేయాలి.