మానసిక ఆందోళన కలుగుతుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిరుత్సాహం దరి చేరనివ్వవద్దు. కీలక వ్యవహారాల్లో మీరు చూపెట్టే చొరవతో ప్రశంసలు పొందుతారు. పరమేశ్వరుడిని ఆరాధించాలి.
శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం చతుర్ధి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి మంగళవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: కుటుంబంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. కుటుంబసభ్యులు సహకారం దక్కుతుంది. స్వధర్మం సానుకూల ఫలితాలు ఇస్తుంది. శివుడిని ఆరాధించాలి.
వృషభం:తొందరపాటు ప్రయత్నాలు చేదు ఫలితాలు ఇస్తాయి. ఆకస్మిక భయం, ఆందోళన చుట్టుముడుతాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. శని జపం చేయాలి.
మిథునం: మానసిక ఆందోళన కలుగుతుంది. చేసే ప్రయత్నాలు ఆలస్యమైనా సానుకూల ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి పొందుతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇష్ట దైవాన్ని ఆరాధించాలి.
కర్కాటకం: చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆకస్మిక ధన లాభం దక్కుతుంది. రుణ బాధలు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మి దేవిని సందర్శించుకోవాలి.
సింహం:మానసిక ఆందోళన కలుగుతుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నిరుత్సాహం దరి చేరనివ్వవద్దు. కీలక వ్యవహారాల్లో మీరు చూపెట్టే చొరవతో ప్రశంసలు పొందుతారు. పరమేశ్వరుడిని ఆరాధించాలి.
కన్య:కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. కొత్త కార్యాలు, పనులు చేపట్టవద్దు. ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. శివుడిని పూజించాలి.
తుల: ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఇతరులకు సహాయ పడడంతో సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. శివ స్తోత్రం చదవాలి.
వృశ్చికం: ప్రయాణాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అప్పులు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.
ధనుస్సు: అకారణంగా కలహాలు ఏర్పడతాయి. అనవసర భయాందోళనకు గురవుతారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందింపజేస్తాయి. ఈశ్వరుడిని పూజించాలి.
మకరం:ఇంట్లో మార్పులు జరుగుతాయి. నిరుత్సాహంగా ఉంటారు. ప్రయత్న కార్యాలు విజయవంతమవుతాయి. కొన్ని పనులు వాయిదా పడుతాయి. ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. శ్రీలక్ష్మి దేవి సందర్శనం చేయాలి.
కుంభం:చెడు పనులకు దూరంగా ఉండాలి. మానసిక వేదనకు లోనవుతారు. కోపాన్ని నియంత్రించుకోవడం శ్రేయస్కరం. కొత్త పనులు చేపట్టరాదు. ఇష్టదైవాన్ని సందర్శించుకోవాలి.
మీనం: ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు ఎదురవుతాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అనవసర ధన వ్యయం జరుగుతుంది. ఇష్ట దైవాన్ని ఆరాధించాలి.