శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి శుక్రవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం:ప్రయత్న కార్యాలు విజయవంతమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ముఖ్యమైన పని పూర్తవడంతో సంతోషంగా ఉంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇష్టదైవాన్ని దర్శించుకుంటే అంతా శుభమే.
వృషభం:కుటుంబంతో ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇతరులకు ఉపకారం చేసేలా పనులు చేస్తారు. పేరు ప్రతిష్టలు దక్కుతాయి. ముఖ్యమైన విషయాల్లో శుభం జరుగుతుంది. ఇష్టదైవ నామస్మరణ చేయాలి.
మిథునం: చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. శుభవార్త వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
కర్కాటకం:విజయాలు పొందుతారు. శుభవార్త వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. వృత్తి, ఉపాధి, వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మొహమాటం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.
సింహం: ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. దుబారా ఖర్చు పెరుగుతుంది. ఇష్టదేవతా స్తోత్రం పారాయణం చేయాలి.
కన్య: కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తీరిపోతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విష్ణు నామస్మరణ చేయాలి.
తుల: మీకు ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కొన్నింటిని ఎదుర్కొంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. సౌభాగ్య సిద్ధి ఉంది. లక్ష్మి సహస్రనామం పఠించాలి.
వృశ్చికం: శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక లాభాలు పొందుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.
ధనుస్సు: కుటుంబంలో కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అశుభం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనకు గురవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
మకరం: కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బందులు కలిగిస్తాయి. చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రశాంతమైన మనసుతో ఉండాలి. గణపతి ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది.
కుంభం: ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. సమాజం నుంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబంలో ఆనందాలు నిండుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.
మీనం: కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. కానీ వాగ్వాదానికి దిగకూడదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గా ధ్యానం చేయాలి.