»Chardham Yatra Heavy Snowfall In Kedarnath Trip Stopped
Chardham Yatra : కేదార్నాథ్లో భారీగా హిమపాతం.. యాత్ర నిలిపివేత
మంచు వర్షం కారణంగా 4 వేల మంది భక్తులు కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాతావరణం అనుకూలించే వరకూ భక్తులు కేదార్నాథ్(Kedarnaath) వెళ్లేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు.
కేదార్నాథ్(Kedarnaath)లో భారీగా మంచు కురవడం(Snowing) వల్ల అధికారులు చార్ధామ్ యాత్ర(Chardham Yatra )ను అత్యవసరంగా నిలిపివేశారు. హిమపాతం(Snowfall) వల్ల సోన్ప్రయాగ్లో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పర్యాటకులను అనుమతించడం లేదు. 4 వేల మంది భక్తులను కేదార్నాథ్ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాతావరణం అనుకూలించే వరకూ భక్తులు కేదార్నాథ్(Kedarnaath) వెళ్లేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు.
గత 30 గంటల్లో 14 వేల మందికి పైగా భక్తులను కేదార్నాథ్(Kedarnaath) ఆలయానికి పంపారు. అందులో 50 శాతం మంది మధ్యాహ్నం వరకూ కేదార్నాథ్ ధామ్ వరకు ఇప్పటికే చేరుకున్నారు. ఇంకొందరు భక్తులు గౌరీకుండ్, జంగల్చట్టి, భీంబాలి, లించోలికి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. భారీ హిమపాతం(Snowfall) వల్ల విపరీతంగా చలి పెరుగుతోందని, మంచు బారి నుంచి భక్తులను రక్షించేందుకు మందిర్ మార్గ్ తో పాటుగా పలు ప్రదేశాల్లో జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ రెయిన్ షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భారీ హిమపాతం(Snowfall) వల్ల అధికారులు దుకాణాలన్నింటినీ ఇప్పటికే మూసి వేశారు. మరోవైపు పోలీసులు, ఐటీబీపీ, పీఆర్డీ జవాన్లు కేదార్నాథ్(Kedarnaath) చేరుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో దట్టంగా మంచు కురవడంతో యాత్రను నిలిపివేశారు. మంచు వర్షం నేపథ్యంలో భక్తులకు ఎటువంటి సమస్య రాకుండా భద్రత, ఆరోగ్యం తదితర ఏర్పాట్లు చేస్తున్నట్లు రుద్రప్రయాగ్ కలెక్టర్ మయూర్ దీక్షిత్ తెలిపారు.