తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాల కారణంగా తిరుమల శ్రీవారి(Srivari)ని దర్మించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు లభించిన సెలవులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు(Devotees) పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు
మూడు రోజులు వరుస సెలవులు కావడంతో తిరుమల (Tirumala) కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో నేడు కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. ఉద్యోగులు(employees), ఇంటర్ పరీక్షలు పూర్తయిన విద్యార్థులతో తిరుమల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ బాగా పెరిగిపోవడంతో స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన క్యూలైన్ శిలాతోరణం అవతలి వరకు ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల (Tirumala) కొండ నిండా భక్తులే ఉన్నారు. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తిరుపతి దేవస్థానంలో (Tirupati Devasthanam) భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి (Srivari) సర్వదర్మనానికి 30 గంటల సమయం పడుతుంది.
కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామలోరి కల్యాణం కమనీయంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు రామనామస్మరణతో మార్మోగాయి.
పట్టాభిషేకాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంది.
Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్‌లో ఉన్న రాశి ఫలాలు చదవగలరు.
నవమి సందర్భంగా గురువారం మిథిలా స్టేడియంలో కల్యాణం కమనీయంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్ లగ్నం ముహూర్తంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సీతమ్మ మెడలో రామయ్య మంగళధారణ చేశారు. వేద మంత్రోచ్ఛరణలతో భద్రాద్రి క్షేత్రం ఘోషించింది.
మేష రాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వృత్తిపరంగా కొన్ని చికాకులు రావొచ్చు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ధనం ఖర్చు, స్వల్ప ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.