శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం పాడ్యమి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి శుక్రవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: అద్భుత అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులువుగా నెరవేరుతాయి. ధనలాభం దక్కుతుంది. కొత్త పనులు చేపడుతారు లక్ష్మి దేవిని ఆరాధించాలి..
వృషభం: ఆటంకాలు ఎదురై ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. కొందరి వలన ఇబ్బందులు కలుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అధ్భుత శక్తి సామర్థ్యాలు పొందుతారు. గో సేవ చేయాలి.
మిథునం: మీకు సానుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు ఆనందంగా ఉంటాయి. మానసికోల్లాసాన్ని పొందుతారు ఇష్టదేవత స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
కర్కాటకం: ఆత్మీయుల సహకారం దక్కుతుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కీలక విషయాల్లో మనసు చెప్పిన విధంగా నడుచుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధాన చేయాలి.
సింహం: ఆర్థిక విషయాల్లో దుబారా ఖర్చులు లేకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొత్త కార్యాలు ప్రారంభించవద్దు. ఆపదలు కలగకుండా రామరక్ష స్తోత్రం పఠించాలి.
కన్య: ఉద్యోగ, వృత్తిపరంగా కొంత ప్రతికూల ప్రభావం ఉంటుంది. కొన్ని సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ బాధ్యతలు భారంగా మారుతాయి. ఆదిత్య హృదయం చదివితే సత్ఫలితం ఉంటుంది.
తుల: మీ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులను మీ మేధాశక్తితో విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు రావొచ్చు. ఒక విషయం మానసిక సంఘర్షణకు గురి చేస్తుంది. ప్రసన్నాంజనేయ స్వామి స్తోత్రాన్ని పఠించాలి..
వృశ్చికం: మానసిక ఆందోళన ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ధర్మ సిద్ధి ఉంది. దైవరాధన చేస్తే మేలు జరుగుతుంది.
ధనుస్సు:కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో పనులు చేయడానికి ముందుకు కదలాలి. ఉన్నత ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రుల వద్ద గౌరవం పెరుగుతుంది. ఆంజనేయస్వామి దర్శనం చేసుకోవాలి.
మకరం: ఒక మంచి అవకాశం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. శ్రమ భారం పెరగకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన విషయాల్లో మీకు కలిసి వస్తుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి.
కుంభం: ధన లాభం కలుగుతుంది. ధర్మ సిద్ది పొందుతారు. శత్రువలపై ఒక మెట్టు ఎక్కుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. మానసిక ఆనందం లభిస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధించాలి.
మీనం:ముఖ్యమైన విషయాల్లో పెద్దలు చెప్పే విషయాలు పాటించాలి. మానసిక వేదన కలిగించే విషయాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు ఆచితూచి చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి.